Begin typing your search above and press return to search.

గ్రాండియర్ అంటూ ఎమోషన్ మిస్ అయ్యాడా?

By:  Tupaki Desk   |   27 Sep 2019 9:30 AM GMT
గ్రాండియర్ అంటూ ఎమోషన్ మిస్ అయ్యాడా?
X
మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' రిలీజ్ కు చాలారోజుల క్రితమే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రిలీజుకు వారం రోజులు కూడా లేదు. మెగాస్టార్ సినిమాపై ఎప్పుడు ఉండే క్రేజ్ ఇప్పుడు కూడా ఉంది కానీ 'సైరా' అని ప్రత్యేకమైన బజ్ అయితే పెద్దగా కనిపించడం లేదు. ఒకవైపు ప్యాన్ ఇండియన్ ఫిలిం గా ప్రొజెక్ట్ చేసినా ఆ స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాపై కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. సినిమా టీజర్ ట్రైలర్లకు కూడా యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కొందరు బాగుందని అంటున్నప్పటికీ కొందరు మాత్రం ప్రోమోస్ లో ఉన్న లోటుపాట్లను నిర్మొహమాటంగా ఎత్తిచూపుతున్నారు.

అలాంటివాటిలో ఒకటి చిరంజీవి వాయిస్. సినిమాలో ఉన్న పవర్ ఫుల్ పాత్రకు చిరు వాయిస్ సరిపోలేదని అంటున్నారు. నిజానికి చిరు రీఎంట్రీ చిత్రం 'ఖైది నెం. 150' లోనే మెగాస్టార్ వాయిస్ లో తేడా ఉందని గుర్తించారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే కంప్లైంట్ వినిపిస్తోంది. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన గ్రాండియర్ గా సినిమాలు తీయడంలో దిట్టే కానీ ఆ మాయలో పడి కథలో ఎమోషన్ ను మిస్ చేస్తాడనే అపవాదు కూడా ఉంది. గతంలో సురేందర్ దర్శకత్వంలో ఫెయిల్ అయిన సినిమాలు గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అంతే కాకుండా కొన్ని రోజుల క్రితం వరకూ ఇది రియల్ స్టొరీలా..సిసలైన చరిత్రను స్టడీ చేసి తీసిన సినిమాలా చెప్పిన సురేందర్ తాజాగా ఇది బయోపిక్ కాదంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ప్రోమోలపై అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తూ.. కమర్షియల్ మసాలా ఎక్కువైందని చెప్పిన వారిపై ఫ్యాన్సేమో గుర్రుగా ఉన్నారు.

మరి కథకు ఆ రేంజ్ లో కమర్షియల్ టచ్ ఇస్తే ప్యాన్ ఇండియా లెవెల్ లో ఆదరణ దక్కుతుందా అనేది కొందరి ప్రశ్న. మరొక అంశం ఏంటంటే ఇలా ఇలా ఫ్రీడం ఫైటర్లపై తీసిన సినిమాలలో ఈమధ్య రిలీజ్ అయినవి ఎక్కువ శాతం ఆడియన్స్ ఆదరణకు నోచుకోలేదు. హిందీలో 'మంగళ్ పాండే'.. నాగార్జున నటించిన 'రాజన్న' సినిమాల పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. మరి 'సైరా' ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్లను దాటి విజయం సాధిస్తుందా అనేది వేచి చూడాలి.