Begin typing your search above and press return to search.
'డియర్ మేఘ' నుంచి ఎమోషనల్ సాంగ్: 'గుండెల్లో కన్నీటి మేఘం'
By: Tupaki Desk | 7 Aug 2021 5:01 AM GMTమేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం ''డియర్ మేఘ''. ఎ.సుశాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ ఈ చిత్రంపై ఆసక్తిని కలిగించాయి. అలానే 'ఆమని ఉంటే పక్కన' లిరికల్ సాంగ్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో చిత్రంలోని 'గుండెల్లో కన్నీటి మేఘం' అనే మరో లిరికల్ సాంగ్ వీడియోను హీరోయిన్ హెబ్బా పటేల్ శనివారం విడుదల చేశారు.
'గుండెల్లో కన్నీటి మేఘం.. కమ్మిందా తానైతే దూరం.. అడిగే లోపే అతడే లేడే.. గతమే పోదే మరుపే రాడే..' అంటూ ఎమోషనల్ గా సాగే ఈ పాట శ్రోతల మనసులను తాకుతుంది. ప్రేమికుడి దూరమైన ప్రేయసి.. బాధలో తన మనసులోని ఫీలింగ్స్ ని చెప్పుకునేలా ఈ గీతం రూపొందించబడింది. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర ఈ పాటకు శ్రావ్యమైన బాణీలు సమకూర్చగా.. సింగర్ హరిణి వినసొంపుగా ఆలపించారు. దీనికి గేయ రచయిత కృష్ణ కాంత్ హృదయాలను ద్రవింపజేసే సాహిత్యం అందించారు.
భావోద్వేగ ప్రేమకథగా తెరకెక్కుతున్న ''డియర్ మేఘ'' సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. పీఎస్ వర్మ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.