Begin typing your search above and press return to search.

హీరోయిన్లతో లిప్ లాక్.. భార్యకో బ్యాగ్

By:  Tupaki Desk   |   1 Jun 2016 9:30 AM GMT
హీరోయిన్లతో లిప్ లాక్.. భార్యకో బ్యాగ్
X
మన నేచురల్ స్టార్ ఆ మధ్య ‘ఆహాకళ్యాణం’ అనే సినిమాలో చిన్న లిప్ లాక్ చేసినందుకు అతడి భార్య తెగ ఫీలైపోయి ఏడ్చుకుంటూ థియేటర్ నుంచి బయటికి వచ్చేసిందట. ఆమెకు సర్దిచెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేసరికి చాలా కష్టమైపోయిందని.. ఇకపై లిప్ లాక్స్ జోలికే వెళ్లొద్దని అప్పుడే నిర్ణయించుకున్నానని అన్నాడు నాని. ఎంత సినిమా అయినా సరే.. తమ భర్త ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకునే విషయంలో సెలెబ్రెటీ వైవ్స్ ఎలా ఉంటారో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ. ఒక్క ముద్దుకే నాని అలాంటి అనుభవం ఎదుర్కొంటే.. ఇక ఇప్పటిదాకా కౌంట్ లెస్ లిప్ లాక్స్ చేసి.. సీరియల్ కిస్సర్ గా గుర్తింపు పొందిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఐతే తన భార్య ఈ లిప్ లాక్స్ విషయంలో అంత లైట్ ఏమీ కాదంటున్నాడు హష్మి. ఈ ముద్దుల విషయంలో తను కూడా చాలా బాధపడుతూ ఉంటుందని.. తన మీద చాలా కోపం చూపిస్తుందని.. ఐతే ఆమెను కూల్ చేయడానికి తన దగ్గరో చిట్కా ఉందని అంటున్నాడు హష్మి. తన భార్యకు స్టైలిష్ గా ఉండే కాస్ట్లీ బ్యాగులంటే చాలా ఇష్టమని.. తాను లిప్ లాక్ సీన్ చేసినప్పుడల్లా ఆమె కోసం ఓ అందమైన.. ఖరీదైన బ్యాగ్ పట్టుకొస్తానని.. దీంతో ఆమె కూల్ అయిపోతుందని.. అంటున్నాడతను. ఇలా తాను తీసిచ్చిన బ్యాగులతో ఓ గదంతా నిండిపోయిందంటూ అతను చమత్కరించాడు. ఐతే కేవలం ఆమెకు ఒక బ్యాగ్ తీసిస్తే హష్మి ఏం చేసినా పర్వాలేదన్నమాట అంటూ జోకులు పేల్చుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.