Begin typing your search above and press return to search.
కొడుకు క్యాన్సర్ పై హీరో పుస్తకం
By: Tupaki Desk | 16 Oct 2015 5:30 PM GMTహీరో ఇమ్రాన్ హష్మి. మనిషి చాలా మంచోడు. ఎదో తెర మీద అలా రొమాంటిక్ ఎఫైర్లు ఉన్న పాత్రల్లో నటిస్తుంటాడు కాని.. నిజ జీవితంలో మాత్రం తన భార్య పర్వీన్ షహానీపై ఎంతో ప్రేమగా ఉంటాడు. ఇల్లూ ఇల్లాలూ టైప్. వీరికి అయాన్ హష్మి అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. దురదృష్టవశాత్తూ ఈ పసికందు క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. పాపం మన హీరో ఎమోషనల్ గా ఎంతో చితికిపోయాడు అప్పట్లో..
అందుకే ఇప్పుడు తన కొడుకు పడిన ఆ కష్టాన్ని.. అతని ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లి అక్కడ వీరు పడిన మానసిక యాతనను ఒక పెద్ద పుస్తకంగా రాయాలని మనోడు భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెబుతున్నాడు. 'నా జీవితంలో గత రెండేళ్లుగా కష్టాలు చవిచూస్తున్నా. ఇద్దరు గొప్ప గురువులను గుర్తించా. వారిద్దరూ కేన్సర్, నా కొడుకు. నాకెదురయిన అనుభవాలపై ఓ పుస్తకం రాయబోతున్నా' అని ఇమ్రాన్ ట్వీట్ చేశాడు ఈరోజు. వచ్చే ఏడాది ఈ పుస్తకం విడుదల చేయాలని చూస్తున్నాడట. ఇకపోతే స్టేజ్ 1 క్యాన్సర్ తో బాధపడిన అయాన్.. ఇప్పుడు కోలుకున్నాడు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇమ్రాన్ టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిసున్న ''అజార్'' చిత్రంలో నటిస్తున్నారు.