Begin typing your search above and press return to search.

మరో సినిమాని పైరసీ హడలెత్తించేసింది

By:  Tupaki Desk   |   14 Sep 2016 2:03 PM GMT
మరో సినిమాని పైరసీ హడలెత్తించేసింది
X
పైరసీ దెబ్బ ఈ ఏడాది బాలీవుడ్ ని బాగానే భయపెట్టింది. రిలీజ్ కి ముందే ఆన్ లైన్ లో పైరేటెడ్ కాపీ వచ్చేయడం.. ఉడ్తా పంజాబ్ మూవీ నుంచి బాగా ఎక్కువైపోయింది. గ్రేట్ గ్రాండ్ మస్తీ అయతే.. ఈ పైరసీ దెబ్బకి కంప్లీట్ డిజాస్టర్ అయిపోయింది. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'రాజ్ రీబూట్' ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోందన్న వార్తలు.. నిర్మాతలను కంగారు పెట్టించేశాయి.

ఆన్ లైన్ లో డౌన్ లోడ్ లింకులు కూడా చక్కర్లు కొట్టేస్తుండడంతో.. డ్యామేజ్ కంట్రోల్ కోసం హీరోగా నటించిన ఇమ్రాన్ హష్మి నేరుగా రంగంలోకి దిగాడు. దయచేసి పైరసీ కాపీ చూడద్దని.. ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు. అయితే.. కంప్లెయింట్ ఇచ్చేందుకు ముందు.. ఎంతమేరకు కంటెంట్ లీక్ అయిందో చూడ్డంకోసం.. నిర్మాతలు కూడా డౌన్ లోడ్ చేసుకుని చూడాల్సి వచ్చింది. అయితే.. ఇక్కడ వీరికి కొంత రిలీఫ్ దక్కింది.

సెన్సార్ వారి అబ్జెక్షన్స్ తో సినిమా నుంచి తొలగించిన హీరోయిన్ డైలాగ్స్ (fu**)లు మాత్రమే ఆన్ లైన్ లో ఉన్నాయి. దీంతో రాజ్ రీబూట్ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ మూవీలో ఇమ్రాన్ హష్మికి తన జీవితంలోనే తొలి ముద్దు ఇచ్చానని హీరోయిన్ కృతి కర్బందా చెబుతోంది. ఆ ముద్దులేంటో.. ఈ ఎఫ్ లు ఏంటో.. లెక్క తేలాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.