Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: ధనుష్ బుల్లెట్ దూసుకొస్తోంది
By: Tupaki Desk | 25 Dec 2016 5:32 AM GMTకోలీవుడ్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ఎనై నోకి పాయుం తోట. బుల్లెట్ నావైపు దూసుకొస్తోంది అని తెలుగులో టైటిల్ అర్ధం. టైటిల్ వినగానే ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనిపించడం ఖాయం. అయితే డైరెక్టర్ గౌతమ్ మీనన్ కావడంతో.. అలా ఒకే జోనర్ దగ్గర ఆగిపోయే ఛాన్స్ ఉండదన్న మాట.
ధనుష్.. మేఘా ఆకాష్ లు నటించిన ఎనై నోకి పాయుం తోట టీజర్ ను రిలీజ్ చేశారు. మొదటి ఫ్రేం నుంచి ఒక గన్ తో మొదలు పెట్టి.. చివరి వరకూ ఆ గన్ తో ఉన్న లింక్ ను కంటిన్యూ చేశారు. ధనుష్ రెండు మూడు గెటప్స్ తో ఆకట్టుకున్నాడు. కాలేజ్ కుర్రాడిగా లుక్స్ తో పాటు.. పగ తీర్చుకునేందుకు రఫ్ గా మారిపోయిన ధనుష్ కూడా కనిపిస్తాడు. తనను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకునేందుకు వెతుక్కుంటూ ఉంటాడు ధనుష్. ఈ అనుమానితుల్లో హీరోయిన్ ను కూడా ఉండడం విశేషం.
మేఘా ఆకాష్ చూడముచ్చటగా ఉండడమే కాదు.. పెర్ఫామెన్స్ కూడా బాగుంది. ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించగా.. గౌతమ్ మీనన్ మరోసారి లవ్ ప్లస్ క్రైమ్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి మూవీ తీశాడు. ఈ కంబైన్డ్ జోనర్ ఇప్పటివరకూ ఆయనకు అంతగా అచ్చి రాలేదు కానీ.. ఈసారి మాత్రం వర్కవుట్ అయ్యేలాగే ఉంది.