Begin typing your search above and press return to search.
ప్రేమలోని మరో కోణం - ట్రైలర్ టాక్
By: Tupaki Desk | 24 Aug 2019 11:42 AM GMTకమర్షియల్ దర్శకులకు దూరంగా తనదైన పంధాలో సినిమాలు తీసే గౌతమ్ వాసుదేవ మీనన్ కొత్త సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. అంటే తెలుగులో నా పేరుమీదున్న ఒక బులెట్ అని అర్థం. దీని ట్రైలర్ ఇందాకా విడుదల చేశారు. గత కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు బయటికి వచ్చేందుకు రెడీ అవుతోంది.
కథ విషయానికి వస్తే రఘు(ధనుష్)సినిమా హీరోయిన్ లేఖ(మేఘా ఆకాష్)ను ప్రేమిస్తాడు. ఇద్దరు ఘాడమైన ప్రేమలో మునిగి తేలతారు. తాను నిజంగా లవ్ లో ఉన్నాడా లేక ఆకర్షణకు లోనయ్యాడా అనే సంఘర్షణ నిత్యం రఘులో ఉంటుంది. అనూహ్యంగా ఈ ఇద్దరి జీవితాల్లో అలజడి వస్తుంది. కొత్త వ్యక్తులు వచ్చి విడదీస్తారు. రఘు అన్నయ్య(శశికుమార్)కూడా వాళ్లలో ఉంటారు. అప్పటిదాకా లేఖ దూరం కావడాన్ని భరిస్తూ వచ్చిన రఘు ఆపై మృగంలా మారతాడు. అసలు ఇంత అలజడికి కారణం ఏంటి అనేది తెరపై చూడాల్సిందే
కథ పరంగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్న ఈ మూవీ థీమ్ గౌతమ్ మీనన్ ఫాలో అయ్యే టిపికల్ స్టైల్ లోనే సాగింది. విజువల్స్ షాట్స్ అన్ని గతంలో వచ్చిన సినిమాల తరహాలోనే కనిపించినప్పటికీ ధనుష్ స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో పాటు మేఘ ఆకాష్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ దీనికి బలంగా నిలుస్తున్నాయి. ధనుష్ లుక్స్ రకరకాల షేడ్స్ లో విభిన్నంగా ఉన్నాయి. మిగిలిన యాక్టర్స్ ని ఎక్కువగా రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ చేశారు. శివ సంగీతం జోమన్-మనోజ్ ఛాయాగ్రహణం గౌతమ్ టేస్ట్ కు తగ్గట్టు టెక్నీకల్ గా సాగాయి. కమర్షియల్ అంశాలు తక్కువగా అనిపిస్తున్న ఈ మూవీ తెలుగులో డబ్ కావడం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు