Begin typing your search above and press return to search.

2.ఓ: రెహ‌మాన్ మార్క్ ట్యూన్

By:  Tupaki Desk   |   20 Oct 2018 7:09 AM GMT
2.ఓ: రెహ‌మాన్ మార్క్ ట్యూన్
X
సంగీత ద‌ర్శ‌కులు ఎంద‌రు ఉన్నా .. ఏ.ఆర్‌.రెహ‌మాన్ ప్ర‌త్యేక‌తే వేరు. సాంప్ర‌దాయ సంగీతానికి పాశ్చాత్య బాణీని అద్ది కొత్త పంథాలో వెళ్ల‌డం ఆయ‌న శైలి. రొటీనిటీకి భిన్నంగా ఆలోచించ‌డం - సాంకేతిక‌త‌లో అప్‌ డేటెడ్‌ గా ఉండ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. సూఫీ సంగీతంలోని ఓ ప్ర‌త్యేక‌మైన గ‌మ్మ‌త్త‌యిన స్వ‌రాల్ని రెహ‌మాన్ భార‌తీయ సినిమా సంగీతానికి అద్ద‌డం వ‌ల్ల కొత్త‌ద‌నం సాధ్య‌మైంద‌ని విశ్లేషిస్తారు.

ఇటీవ‌లే ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన న‌వాబ్ బాణీలు కొత్త‌గా లేక‌పోయినా - రీరికార్డింగ్ ప‌రంగా ఆక‌ట్టుకుంది. తాజాగా 2.ఓ ఆడియో ఆల్బ‌మ్ నుంచి సింగిల్స్‌ ని లాంచ్ చేస్తున్నారు. తొలిగా `ఎన్ ఉయిరే ఎన్ ఉయిరే..` అంటూ సాగే ఓ పాట‌ను లాంచ్ చేశారు. ఈ పాట‌లో రెహ‌మాన్ స్టైల్ వెస్ట్ర‌న్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటోంది. రోబో చిత్రంలో చిట్టీ- ఐష్ పార్టీ సాంగ్‌ స్టెప్‌ కి కంపోజ్ చేసిన ఓ బిట్ అప్ప‌ట్లో ఓ రేంజులో ఉర్రూత‌లూగించింది. దానికి కొన‌సాగింపు సంగీతం త‌ర‌హాలో అనిపించినా... రెహ‌మాన్ మార్క్ మెలోడీ క‌నిపించింది.

త‌న సినిమాలో పాట‌ల్ని విజువ‌ల్ రిచ్‌గా తెర‌కెక్కించ‌డం శంక‌ర్ శైలి. రెహ‌మాన్ ట్యూన్‌ కి త‌గ్గ‌ట్టే టెక్నాల‌జీ బేస్ లుక్‌ తో ర‌జ‌నీ- ఎమీజాక్స‌న్ జంట‌పై ఈ పాట‌ను తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది. సాంకేతికంగా హై ఎండ్ రోబోటిక్‌ టెక్నాల‌జీ అంటే ఏంటో ఈ పాట‌లో ఆవిష్క‌రిస్తారేమో చూడాలి. ఇక చిట్టీ రోబోతో ఎమీజాక్స‌న్ ల‌వ్‌ స్టోరి ఏంటి? అన్న‌ది ఉత్కంఠ పెంచుతోంది. న‌వంబ‌ర్ 29న సినిమా రిలీజ‌వుతోంది. దీపావ‌ళి కానుక‌గా ట్రైల‌ర్ రిలీజ్‌ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.