Begin typing your search above and press return to search.
వీడియో సాంగ్: వర్మ టార్గెట్ మారిందే
By: Tupaki Desk | 8 Jan 2019 1:05 PM GMTటాలీవుడ్ లోనే కాదు ఎక్కడైనా సరే వర్మ రేంజ్ లో పబ్లిసిటీ చేసుకోవడం ఎవరి వల్లా కాదు. కంటెంట్ ఉన్నా లేకపోయినా జనంలో ఆసక్తిని రేపి ఎంతో కొంత ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుని పెట్టుబడిని సేఫ్ చేసుకోవడంలో వర్మ తెలివి ముందు ఎవరైనా బలాదూరే. ఈ పొగడ్త అతని మార్కెటింగ్ కి కానీ సినిమాలకు కాదు. ఇకపోతే మరికొద్ది గంటల్లో నందమూరి ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కానుండగా వర్మ సరైన సమయంలో టైం చూసి బాంబు విసిరాడు.
ఇంతకు ముందు వెన్నుపోటు పాటతో పోలీస్ కేసుల దాకా తెచ్చుకున్న వర్మ ఈ సారి ఎందుకు అనే వెరైటీ థీమ్ ను ఎంచుకున్నాడు. లక్ష్మి పార్వతిని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ అసలు ఆవిడను ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని పాట మొత్తం ఒకే టోన్ లో తీసుకెళ్లిపోయాడు. ఇందరు అందగత్తెలు ఉండగా లక్ష్మి పార్వతి ఎందుకు కుటుంబం వద్దంటున్నా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కోట్లాది అభిమానులు సరిలేని రాజకీయ బలం ఉన్నా ఎందుకు ఆవిడని వరించాల్సి వచ్చిందంటూ పాట మొత్తం ఇదే తీరులో సాగింది.
సిరాశ్రీ సాహిత్యం సమకూర్చగా కళ్యాణి మాలిక్ స్వీయ స్వరకల్పనలో శ్రీకృష్ణతో కలిసి పాడాడు. ట్యూన్ పెద్దగా లేదు. ఏదో అలా చెప్పుకుంటూ పోయినట్టు ఉంది తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ హడావిడి సమయంలో ఈ పాట ద్వారా వర్మ లక్ష్మి పార్వతిని హై చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. అసలు ఆ బయోపిక్ లో ఈవిడ పాత్రే లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా పక్కా స్కెచ్ తో వర్మ రావడం చూస్తే ఆహా ఏమి తెలివితేటలు అనిపించక మానదు.