Begin typing your search above and press return to search.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో 'ఎనిమీ'
By: Tupaki Desk | 1 Nov 2021 4:39 AM GMTతెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాలీవుడ్ హీరోలతో సహా పలువురు ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. తాజాగా తమిళ హీరోలు విశాల్ మరియు ఆర్య లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. వీరిద్దరు కలిసి నటించిన ఎనిమి సినిమా దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా విశాల్ మరియు ఆర్యలు కలిసి మొక్కలు నాటారు. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో వీరు మొక్కలు నాటడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు మరియు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవలే తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన సమయంలో అతడు నిర్వహిస్తున్న ఛారిటీ ని తాను కొనసాగిస్తాను అంటూ విశాల్ ప్రకటించి మంచి మనసును చాటుకున్నాడు. ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం ద్వారా సామాజిక స్పృహను చాటుకున్నాడు అంటూ అభిమానులు అభినందిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మరియు సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అభినందనీయం అంటూ హీరోలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణం ఇచ్చే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మరింత మంది పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. విశాల్ మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. సమాజం పట్ల బాధ్యతతో వారు మొదలు పెట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టుతుందని అన్నాడు. భవిష్యత్తు తరాల వారి మనుగడ కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో మొక్కలు పెంచాలంటూ ఈ సందర్బంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.