Begin typing your search above and press return to search.
శ్రీమంతుడుకి ఇంగ్లీష్ టైటిల్స్ వేస్తున్నారు
By: Tupaki Desk | 8 Aug 2015 6:37 AM GMTశ్రీమంతుడు మహేష్ కి ఊరట కలిగించే సినిమా అని తొలిరోజు టాక్ వినిపించింది. దర్శకరచయిత కొరటాల శివ మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు (బాహుబలి మినహా) క్రియేట్ చేయడం ఖాయమనే ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తొలిరోజు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సినిమా హిట్టు. మహేష్ ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లొస్తారని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని ముచ్చటించుకున్నారంతా. సినిమా ఆద్యంతం పూర్తి ఎమోషన్ తో నడిపించాడని కొరటాలకు ప్రశంసలు దక్కాయి.
అయితే ఈ సినిమాకి ఈరోజు సాయంత్రం షో నుంచి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ని యాడ్ చేయనున్నారట. దీంతో నాన్ తెలుగు ఆడియెన్ కి కూడా సినిమాని ఆస్వాధించే సౌలభ్యం పెరుగుతుంది. భాషతో పని లేకుండా థియేటర్ల కు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. వాస్తవానికి ఇతర భాషల నుంచి ఇక్కడ రిలీజయ్యే సినిమాలకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేసే సాంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు ఇలా ఓ తెలుగు సినిమాకి ఆంగ్ల టైటిల్స్ వేయడం కొత్త సాంప్రదాయం. ప్రయత్నాలు ఫలించి శ్రీమంతుడు 100కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి.