Begin typing your search above and press return to search.

టైటిల్ ఇలా అవసరమా ?

By:  Tupaki Desk   |   14 Nov 2019 5:30 PM GMT
టైటిల్ ఇలా అవసరమా ?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సంబంధించి టైటిల్స్ ఇంగ్లీష్ లోనే పెట్టేసుకొని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇటివలే రామ్ 'RED' టైటిల్ ను ఇంగ్లీష్ లోనే పెట్టుకొని ప్రమోట్ చేసుకున్నాడు. నిజానికి రామ్ అండ్ టీం సినిమా పోస్టర్ మీద టైటిల్ ను 'రెడ్' అని తెలుగులో పెట్టొచ్చు కానీ అలా చేయలేదు. ఇప్పుడు రవి తేజ కూడా ఇదే ఫాలో అయిపోయాడు. నిజానికి ఇప్పుడు అన్ని సినిమాలు సోషల్ మీడియాలో ఉండే క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి టైటిల్ ను ఇంగ్లీష్ లో డిజైన్ చేయించి ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఏ సినిమాకైనా థియేటర్స్ మాస్ ఆడియన్స్ ముఖ్యం. క్లాస్ ఆడియన్స్ ముందు ప్రాదాన్యం అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లకే ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లోనే కాకుండా తెలుగు పోస్టర్స్ కూడా వాడితే బాగుంటుంది. అప్పుడే మాస్ ఆడియన్స్ కి కూడా టైటిల్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళు థియేటర్స్ కి రావడానికి ఆసక్తి చూపుతారు. లేదంటే టైటిల్ తెలియక స్టార్ హీరోని బట్టో లేదా డైరెక్టర్ ని బట్టో థియేటర్స్ కి వెళ్తారు.

ఏదో కొత్త స్టార్స్ ఇలా ఇంగ్లీష్ లో టైటిల్ ని డిజైన్ చేయించుకుంటే ఒకే కానీ... మాస్ ఫాలోవింగ్ ఉండే రవి తేజ ,రామ్ కూడా పోస్టర్స్ పై ఇలా ఇంగ్లీష్ కె ప్రాదాన్యత ఇవ్వడం దారుణమే.