Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కు సినిమా చూపిస్తున్న మహమ్మారి..!
By: Tupaki Desk | 27 April 2021 5:30 PM GMTకంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్ గతేడాది సినీ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా షూటింగ్స్ నిలిచిపోయి, థియేటర్స్ మూతపడి, సినిమాల విడుదలలు వాయిదా వేసుకొని సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. దీంతో నటీనటులు - దర్శకనిర్మాతల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టులు - టెక్నిషియన్స్ వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక రోజువారీ సినీ కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం. అయితే నెమ్మదిగా కరోనా కేసులు తగ్గడంతో షూటింగ్ లు తిరిగి స్టార్ట్ అయ్యాయి.. లాక్ డౌన్ ఎత్తేయడంతో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి.. సినిమాలు విడుదల అయ్యాయి. సాదారణ పరిస్థితులు వస్తున్నాయి ఇండస్ట్రీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని అనుకుంటుండగా మళ్ళీ ఇప్పుడు మహమ్మారి వైరస్ కలవరపెడుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రతిరోజూ కరోనా కేసులు - మరణాలు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. దీంతో టాలీవుడ్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. థియేటర్స్ క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెద్ద సినిమాలను స్వచ్ఛందంగా షూటింగ్స్ నిలిపివేసుకున్నారు. ఏప్రిల్ - మే నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాల చిత్రీకరణ జరుగుతున్నా త్వరలో వాటిని కూడా తాత్కలికంగా ఆపేయాలని చూస్తున్నారట. ఇదే సమయంలో సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలని సినీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కోవిడ్ దెబ్బకు ఇండస్ట్రీలో గతేడాది పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉందని.. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.