Begin typing your search above and press return to search.

ఇక్కడ ఈరోస్‌.. అక్కడ ఫాక్స్‌..

By:  Tupaki Desk   |   4 July 2015 9:30 AM GMT
ఇక్కడ ఈరోస్‌.. అక్కడ ఫాక్స్‌..
X
చేతులారా పెట్టుబడులు పెట్టి మూతులు కాల్చుకునే కంపెనీలుగా ఆ రెండు సంస్థల పేర్లు చెబుతుంటారు. ఈరోస్‌, ఫాక్స్‌ స్టార్‌ .. వినోద రంగంలో అట్టర్‌ఫ్లాప్‌ షోని చూపించి వేల కోట్లను నష్టపోయిన కంపెనీలుగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాయి. పదండి ఓ లుక్కేద్దాం.

ఈరోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలతో కలిసి వరుసగా సినిమాలు చేస్తున్న బ్యానర్‌గా పేరు తెచ్చుకుంది. ముంబైలో ఉంటూ బాలీవుడ్‌లో పెట్టుబడుటు పెట్టి భారీగా లాభాలు ఆర్జించిన ఈ సంస్థ కాలక్రమంలో దక్షిణాది మార్కెట్‌పై కన్నేసింది. లాభాలు ఎక్కడ ఉంటే అక్కడ కర్ఛీఫ్‌ వేయడం అలవాటు చేసుకుంది. అయితే అచ్చులో బొమ్మ తిరగబడింది ఇక్కదే. దక్షిణాదిన సినిమాలన్నీ బొమ్మ చూపించాయి. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాప్‌లు ఈరోస్‌కి దిమ్మతిరిగేలా చేశాయి. కొచ్ఛాడయాన్‌, 1 నేనొక్కడినే, లింగా పరాజయాలు తీవ్ర సంక్షోభంలో పడేశాయి. అయినా పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న పట్టుదలతో ఈరోస్‌ ఇప్పటికీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ 2, బాలయ్యతో డిక్టేటర్‌ చిత్రాలకు పెట్టుబడులు సమకూరుస్తోంది ఈ సంస్థ.

మరో కంపెనీ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ హాలీవుడ్‌ నుంచి వచ్చి బొక్క బోర్లా పడింది. 2013 నుంచి బాలీవుడ్‌లో వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు తీసి పూర్తిగా నష్టపోయింది. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంది ఈ సంస్థ. మాతృ కి బిజిలీకా మండోలా, బుల్లెట్‌ రాజా, హంషకల్స్‌, బ్యాంగ్‌ బ్యాంగ్‌ లాంటి ఫ్లాప్‌ సినిమాల్ని తీసి బాగా మూతులు కాల్చుకుంది. ఈ ఏడాది కామోషియాన్‌, ఆదూరి కహానీ, బాంబే వెల్వెట్‌ అట్టర్‌ఫ్లాప్‌లు. అయినా ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉందీ సంస్థ. తాజాగా అంతగా గుర్తింపు లేని ముఖాలతో గుడ్డూ రంగీలా అనే చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ త్వరలో రిలీజవుతున్న ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది

అయితే ఒక్క సినిమా హిట్టుతో వచ్చే కలెక్షన్‌తో.. మనోళ్ళు వంద సినిమాల నస్టాల్ని పూడ్చుకుంటారా? అదే పెద్ద సస్పెన్స్‌ ఇక్కడ. ఏదేమైనా ఆ రెండు సంస్థలు కోటి ఆశలతో వచ్చి ఉన్నదంతా వదిలించుకున్నాయి పాపం.