Begin typing your search above and press return to search.
సమ్మర్ షెడ్యూల్ పై ఈరోస్ పంజా
By: Tupaki Desk | 27 Jan 2016 11:30 AM GMTసెలవల సీజన్ కి ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందనే విషయం.. సంక్రాంతికి నాలుగు సినిమాలు హిట్ అయినపుడు అందరికీ బాగా అర్ధమైంది. ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఉన్నా.. ఇపుడు ఇంకా బాగా తెలిసొచ్చింది సినిమా జనాలకు. అందుకే ఇప్పుడు.. సమ్మర్ కోసం కర్చీఫ్ వేసేస్తున్నారు. అందరి కంటే ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చేయనుంది.
ఏప్రిల్ 8న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు.. సర్దార్ ను హోల్ అండ్ సోల్ గా కొనేసిన ఈరోస్ తెలిపింది. ఇప్పుడు ఇదే సంస్థ కోలీవుడ్ హీరో సూర్య- డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన.. 24ని కూడా కొనుగోలు చేసింది. సూర్య సినిమాని ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఈరోస్ చెప్పేసింది. ఇది కాక ఏప్రిల్ లోనే మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా రిలీజ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. మహేష్ తో ఈరోస్ ఇప్పటికే భారీ డీల్ చేసుకుందని, దీని ప్రకారం సూపర్ స్టార్ సినిమాలను ఈ సంస్థే డిస్ట్రిబ్యూట్ చేస్తుందని తెలుస్తోంది. అంటే ఈ వారం కూడా ఈరోస్ ఖాతాలోకే వెళ్లిపోనుందన్న మాట.
మరి ఏప్రిల్ లోనే తన సినిమా సరైనోడుని రిలీజ్ చేయాలని, అల్లు అర్జున్ భావిస్తున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సరైనోడు కూడా భారీ చిత్రమే.. ఇన్నేసి బిగ్ మూవీస్ కి మధ్యలో రావడం రిస్కే అవుతుంది. దీనికితోడు సరైనోడుని గీతా ఆర్ట్స్ స్వయంగా నిర్మించడంతో.. రిస్క్ తీసుకునే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఏమైనా సమ్మర్ షెడ్యూల్ ని ఈరోస్ హైజాక్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.