Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్!
By: Tupaki Desk | 27 Aug 2016 4:18 AM GMTసెంటిమెమెంట్లు చాలా మందికి ఉంటాయి కానీ.. సినిమావాళ్లకు కాస్త ఎక్కువగా ఉంటాయి అనేది నానుడి. ఈ విషయంలో సినిమా పేరు - ఆ పేరులోని అక్షరాల సంఖ్యల దగ్గరనుండి సినిమా విడుదల వరకూ చాలా విషయాల్లో సెంటిమెంట్లది కూడా ప్రధాన పాత్ర ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తాజా సినిమా "జనతా గ్యారేజ్" విషయంలో కూడా ఉన్నట్లుండి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులకు కొత్త టెన్షన్ పుట్టుకొచ్చిందట.
ఎన్టీఆర్ అభిమానులకు వచ్చిన ఈ కొత్త టెన్షన్ పేరు "ఈరోస్" అట! ఎందుకంటే జనతాగ్యారేజ్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతుంది ఈ సంస్థే. అందులో టెన్షన్ ఏముంది అనుకునేరు.. ఎందుకంటే.. తెలుగులో ఈరోస్ సంస్థకున్న గత రికార్డులు అలాంటివి మరి. మహేష్ బాబు "1 - నేనొక్కడినే" దగ్గర్నుంచి మొదలుపెడితే మొన్న వచ్చిన పవర్ స్టార్ "సర్ధార్ గబ్బర్ సింగ్" వరకూ వాళ్లు విడుదల చేసిన సినిమాలు అన్నీ దారుణమైన ఫలితాలనే ఇచ్చాయి. దీంతో సెన్సార్ పూర్తయిన వెంటనే విడుదలయిన పోస్టర్ లో వరల్డ్ వైడ్ రిలీజ్.. ఈరోస్ సంస్థ అని ప్రకటన రావడంతో ఈ కొత్త కంగారు మొదలైందట.
కాగా "జనతా గ్యారేజ్" సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారమే పూర్తయ్యాయి. కట్స్ ఏమీ లేకుండానే ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాను సెప్టెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2 వేల థియేటర్లలో తెలుగు - తమిళ - మలయాళం బాషల్లో భారీగా విడుదల చేయబోతున్నారు. ఇదే సమయంలో ఒకరోజు ముందే అమెరికాలో ప్రిమియర్లు కూడా భారీగానే ప్లాన్ చేశారు. అయితే ఈ విషయాలన్నీ అభిమానులకు ఉత్సాహాన్ని తెప్పిస్తుంటే.. ఈరోస్ సెంటిమెంట్ ఒక్కటే ఆందోళన కలిగిస్తుందట.