Begin typing your search above and press return to search.

సర్దార్ ను గుంపగుత్తగా అమ్మేశారా?

By:  Tupaki Desk   |   10 Aug 2015 11:32 AM GMT
సర్దార్ ను గుంపగుత్తగా అమ్మేశారా?
X
గెస్ట్ రోల్ చేసిన ‘గోపాల గోపాల’ను మినహాయిస్తే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా రిలీజై రెండేళ్లయిపోయింది. పవన్ కొత్త సినిమా ‘సర్దార్’ రిలీజయ్యే టైంకి మూడేళ్ల గ్యాప్ వచ్చేస్తుందేమో. ఐతేనేం పవన్ సినిమా అంటే ఉండే క్రేజే వేరు. సర్దార్ విషయంలో అనేకానేక సందేహాలన్నింటికీ తెరదించేసి ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఐతే గబ్బర్ సింగ్-2 అనౌన్స్ చేసినప్పటితో పోలిస్తే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల సర్దార్ మీద ఇప్పుడంత హైప్ లేదన్నది వాస్తవం. కానీ పవన్ సినిమా రిలీజయ్యే టైంకి ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది. అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. సినిమా బాగుందంటే రికార్డుల మోత మోగడం ఖాయం.

అందుకే దూరదృష్టితో ఆలోచించి ‘సర్దార్’ ను గుంపగుత్తగా కొనేసింది ఈరోస్ ఇంటర్నేషనల్. ఇంతకుముందు 1, ఆగడు లాంటి సినిమాలతో చేతులు కాల్చుకున్న ఈరోస్.. ఈ మధ్య ‘శ్రీమంతుడు’ మీద పెట్టుబడి పెట్టి బాగానే లాభాలు రాబడుతోంది. ఈ ఊపులో ‘సర్దార్’ సినిమాను ఏకంగా రూ.70 కోట్లు పెట్టి ఈ బాలీవుడ్ నిర్మాణ సంస్థ గుంపగుత్తగా కొనేసినట్లు సమాచారం. పవన్ మిత్రుడు, నిర్మాత శరత్ మరార్ సినిమా మీద ఇంకా ఏమీ ఖర్చుపెట్టకుండానే భారీ మొత్తానికి అగ్రిమెంట్ చేసేసుకున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇప్పటికిది ఎక్కువ మొత్తంగానే అనిపించొచ్చు కానీ.. బాహుబలి, శ్రీమంతుడు సినిమాల వసూళ్లను బట్టి చూస్తే ‘సర్దార్’ విడుదల సమయానికి రూ.100 కోట్లకు పైగా బిజినెస్ జరిగినా ఆశ్చర్యం లేదు. ఐతే ఫైనాన్స్ సమస్యలు లేకుండా ముందే రూ.70 కోట్లు వచ్చి పడుతుండటంతో మరో ఆలోచన లేకుండా శరత్ డీల్ ఓకే చేసేసినట్లు తెలుస్తోంది.