Begin typing your search above and press return to search.
బాలయ్య సెంచరీలో వాటా కోసం పోటీ
By: Tupaki Desk | 6 Nov 2015 11:30 AM GMTనందమూరి నటసింహం ఇప్పుడు 99వ చిత్రం షూటింగ్ లో మహా బిజీ. డిక్టేటర్ సూపర్ స్పీడ్ గా తన స్టైల్ లో ఫినిష్ చేస్తున్నాడు బాలయ్య. త్వరలో ప్రారంభం కానున్న ఢిల్లీ షెడ్యూల్ తో టాకీపార్ట్ షూటింగ్ ఫినిష్ కానుంది. ఇంకా ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవక ముందే.. బాలకృష్ణ వందో సినిమాకి ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. డిక్టేటర్ నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ కూడా ఒక భాగస్వామి.
ఈ సంస్థ బాలయ్య వందో చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా బాలకృష్ణకు అందినట్లు సమాచారం. స్థానికంగా ఏదైనా ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి.. బాలయ్య వందో సినిమాని నిర్మించాలన్నది ఈరోస్ ఆలోచన. అయితే.. ఈ డీల్ అంత తేలిగ్గా కుదిరేదేం కాదు. ఎందుకంటే గతంలో లెజెండ్ ని నిర్మించిన 14రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్ - వారాహి చలనచిత్ర సంస్థలు కూడా ఈ రేస్ లో ఉన్నాయి. బాలయ్యతో వందో సినిమా ఎంతో ప్రతిష్టాత్మకం కావడంతో.. ఈ ప్రాజెక్టులో భాగమయ్యేందుకు కంపెనీలు పడుతున్నాయి.
వీటికితోడు ఈ మూవీని.. బాలయ్యకు సింహ - లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తీయనున్నారనే విషయం ఇప్పటికే ఫైనల్ అయింది. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే అంచనాలున్నాయి ఇండస్ట్రీలో. అందుకే ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నిర్మాణ సంస్థలు అనుకుంటున్నాయి. లెట్స్ సీ.. ఏ కంపెనీకి ఈ లక్కీ ఛాన్స్ దొరుకుతుందో.