Begin typing your search above and press return to search.
గాంధీ టైప్ కాదు.. రెండు చెంపలు పగలగొడతా!
By: Tupaki Desk | 22 Oct 2021 6:32 AM GMTహీరోయిన్లు ఎంత అందంగా కనిపిస్తే అంత క్రేజ్. పబ్లిక్ లో ఆ క్రేజ్ కోసం హీరోయిన్లు ఎలాంటి పాట్లు పడతారో చెప్పాల్సిన పనిలేదు. రకరకాల ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ ఫోటో సెషన్స్ లో పాల్గొంటారు. ఒక్కోసారి టూమచ్ ఎలివేషన్స్ అవసరం. అయితే అలాంటప్పుడు నెటి జనులు..ఆకతాయిల నుంచి అసలు చిక్కొచ్చిపడుతుంది. ఇటీవల హద్దుమీరి ఘాటైన కామెంట్లతో నెటిజనం చిర్రెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివాదాలు చెలరేగుతుంటాయి. సరిగ్గా అలాంటి వివాదంలోనే ఇరుక్కుంది ఈషా గుప్తా. అమ్మడు ఇటీవలే కొన్ని టాప్ లెస్ ఫోజులిచ్చి ఇంటర్నెట్ లోకి వదిలింది. అంతే సోషల్ మీడియా వేదికగా నెటి జనులు దుమ్మెత్తిపోసారు.
అసభ్యకర రీతిలో ఈషా గుప్తాని ఉద్దేశించి కామెంట్లు పెట్టారు. దీంతో సహనం నశించిన ఈషా ఇక లాభం లేదనుకుని వార్ లోకి ఎంటర్ అయింది. ``నేను గాంధీ టైపు కాదు.. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించడానికి... రెండు చెంపలు కలిపి వాయించేస్తాను!`` అంటూ హెచ్చరించింది. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై గానీ..కామెంట్ల పైగానీ స్పందించను. అసలు వాటి ఆలోచన కూడా బుర్రలోకి రానివ్వను. కానీ అలా వచ్చేలా హద్దు మీరి ప్రవర్తించారు కాబట్టే ఇలా స్పందిచాల్సి వచ్చిందని ఈషా తెలిపింది. హీరోలు చొక్కాలు విప్పి చూపించినప్పుడు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు ట్రోల్ చేయరు? మహిళలు అంటే అంత చులకనా? ఇలా మాట్లాడితే లింగ వివక్ష చూపిస్తూ కించపరిచి మాట్లాడుతారు.
అలాగని పూర్తిగా ఒళ్లంతా కప్పుకుని చీరలో కనిపిస్తే ఇవేం దుస్తులు.. ఇందులో హాట్ నెస్ ఎక్కడ ఉంది? అంటూ వెటకారమాడుతారు. మేకప్ వేసుకుంటే ప్లాస్టిక్ బ్యూటీ అంటారు. వేసుకోకపోతే అందంగా లేవని అంటారు. ఇండియాలోనే కాదు ప్రపంచ మొత్తం మీద మహిళలు ఇలాంటి వివక్షకు రోజూ గురి అవ్వాల్సి వస్తోందని మండిపడింది. `వీడెవడు` చిత్రంతో ఈషా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `వినయ విధేయ రామ`లో నూ స్పెషల్ అప్పియరెన్స్ తో మెప్పించింది. బాలీవుడ్ లో రేర్ ఫ్యాషనిస్టాగా.. హాట్ బాంబర్ గా వెలిగిపోతోంది.