Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్స్ అసహ్యంగా ఉన్నా అవకాశాలు ఉంటాయి..!
By: Tupaki Desk | 30 Jun 2022 2:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో నెపొటిజం ఎక్కువ అనేది ప్రతి ఒక్కరు ఒకప్పుకునే విషయం. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్ లో మెజార్టీ స్టార్స్ వారసులు అనే విషయం తెల్సిందే. భాష ఏదైనా కూడా అన్ని భాషల ఇండస్ట్రీలో కూడా వారసులు రాజ్యం ఏలుతున్నారు. సౌత్ లో హీరోయిన్స్ వారసత్వంగా వచ్చింది తక్కువే అయినా కూడా ఉత్తర భారతంలో మాత్రం హీరోయిన్స్ కూడా వారసత్వంగా వచ్చిన వారే ఎక్కువ మంది ఉంటారు.
అలా వారసత్వంగా వచ్చిన వారికే ఎక్కు అవకాశాలు.. కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. తాజాగా ఇషా గుప్తా ఈ విషయమై స్పందించింది. ఈ అమ్మడు నటించిన 'ఆశ్రమ్' సిరీస్ కు మంచి ఆధరణ దక్కింది. మూడు సీజన్ ల వల్ల ఈ అమ్మడికి హీరోయిన్ స్థాయిలో గుర్తింపు దక్కింది.
హీరోయిన్ గా ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం వల్ల కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ కిడ్స్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
ఇషా గుప్త మాట్లాడుతూ.. అప్పుడప్పుడు నాకు ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే బాగుండేదని ఎప్పుడు అనిపిస్తుంది. ఒక వేళ నేను స్టార్ కిడ్ ను అయ్యి ఉంటే నా కెరీర్ ఇలా ఉండేది కాదేమో. తాను ఎదుర్కొన్న సమస్యలు నేను ఒక వేళ స్టార్ కిడ్ ను అయ్యి ఉంటే ఎదురయ్యేవి కాదేమో. కొన్ని ప్లాప్ లు పడ్డా కూడా ఇండస్ట్రీలో నాకు ఆఫర్లు వచ్చేవని ఆమె చెప్పుకొచ్చింది.
స్టార్ కిడ్స్ అసహ్యంగా ఉన్నా... వారికి నటన పై అవగాహన లేకున్నా.. కనీసం డాన్స్ రాకున్నా కూడా వారికి మళ్లీ మళ్లీ ఆఫర్లు వస్తాయి. ఒక వేళ్ల వారు ప్లాప్ అయినా కూడా వారి కోసం కొన్ని ఆఫర్లు ఉంటాయి. వాటి ద్వారా వారు సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా కొనసాగుతున్నారు అంటూ తన మనసు లో మాటలను బయట పెట్టి అందరిని ఇషా గుప్తా ఆశ్చర్యపరచింది.
ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. వారిలో ఎవరైనా ఈ అమ్మడి వ్యాఖ్యలకి కనెక్ట్ అయితే వివాదం పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఇషా గుప్తా అన్నట్లుగా స్టార్ కిడ్స్ సరిగా లేకున్నా కూడా ఆఫర్లు దక్కించుకుంటారు అనేది నిజం.