Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: వోగ్ కోసం వయ్యారంగా..
By: Tupaki Desk | 6 Oct 2017 5:34 PM GMTబాలీవుడ్ సెక్సీ బాంబ్ ఈషా గుప్తా ఎలాంటి ముద్దుగుమ్మనో వివరించి తెలియజేయవలసిన అవసరం లేదు. తన అందాలకు ఏ మాత్రం హద్దులు లేవని మగతననికి నా అందాలు సవాల్ అని చెప్పిన ఈషా మళ్లీ చాలా రోజుల తరువాత మరో మత్తెక్కించే ఫొటోతో వచ్చింది. ఆ మధ్య టాప్ లెస్ అందాలతో ఏ స్థాయిలో షాక్ ఇచ్చిందో తెలిసిందే.
ఈసారి కాస్త కొత్తగా అదే తరహాలో తన అందాలను ఆరబోసింది. మొన్నటి వరకు పబ్లిసిటీ కోసం ఫొటో షూట్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కోసం క్లివేజ్ షోతో దర్శనం ఇచ్చింది. వయ్యారాలను వలకోబోస్తూ అమ్మడు ఇచ్చిన స్టిల్స్ కి ఏ విధంగా కామెంట్స్ చెయ్యాలో అర్థం కావడం లేదని ఈషా ఫాలోవర్స్ అంటున్నారు. ఫుల్ బ్లూ డ్రెస్ లో ఈషా అందాలు మతి పోగొడుతున్నాయి. సినిమాల్లో రిజల్టు ఎలా ఉన్నా కూడా.. అమ్మడు ఈ మోడలింగుతో మాత్రం చంపేస్తోంది అంతే.
అయితే అమ్మడి అందాలు బాలీవుడ్ సినిమాలకు కూడా బాగానే ఉపయోగపడుతున్నాయి. రీసెంట్ గా బాద్షాహో సినిమాలో ఇలియానా తో స్క్రిన్ షేర్ చేసుకుంది ఈషా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈషాకి మరో రెండు ఛాన్సులు దక్కాయి. ప్రస్తుతం ఈషా కమాండో సీక్వెల్ సినిమాలో నటిస్తోంది.