Begin typing your search above and press return to search.

అంత న్యూడ్ ఏంటి పిల్లా!!?

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:54 PM GMT
అంత న్యూడ్ ఏంటి పిల్లా!!?
X
కొంతమంది పేరు కోసం.. కొంతమంది బ్రేక్ కోసం.. మరికొంత మంది మ్యాగజైన్ల ఆఫర్ చేసే రెమ్యూనరేషన్ కోసం.. న్యూడ్ గా కూడా ఫోజులిస్తారు. అదిగో ఇప్పుడు మాజీ మిస్సిండియా ఈషా గుప్తా అలాగే చేస్తోంది. ఆల్రెడీ మనకు ఓసారి తాను త్వరలో చూపబోయే ఆ న్యూడ్ టచ్ ఎలా ఉండబోతుందో టేస్ట్ చూపించింది కూడాను. ఇప్పుడు ఆ టేస్టును ఇంకాస్త గట్టి డోసుగా ఇచ్చేసింది.

అదిగో అక్కడ చూస్తున్నారుగా.. అమ్మడు ఏకంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోజిచ్చింది. తన అందచందాలను కెమెరాకు ఎర వేస్తూ.. తన ఆడతనాన్ని కవర్ చేసుకుంటూ.. అక్కర్లేని సొగసులను ఆరబోస్తూ.. అమ్మడు ఎలా ఫోజిచ్చిందో చూడండి. అక్కడికి కరిగిపోయే చాక్లెట్ ను అప్పుడే ఫ్రిడ్జ్ లో నుండి తీసి అందంగా మనముందు ఉంచారేమో అన్నట్లు ఉంది కదూ. చేతిలో అరకొరా సినిమాలున్నా కూడా.. పెద్దగా సక్సెస్ లు కాని.. పెద్ద పెద్ద అవకాశాలు కాని ఈషా ఒళ్లో వాలట్లేదు. అందుకే ఇలా రెచ్చిపోయినట్లుంది అమ్మడు.

ప్రస్తుతం బాలీవుడ్ లో బాద్షాహో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈషా.. ఆ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించింది. ఇక తెలుగులో సచిన్ జోషి సరసన వీడెవడు సినిమాలో అమ్మడు హీరోయిన్ గా కనువిందు చేయనుంది. పైగా ఇప్పుడు ఇలాంటి నులివెచ్చని దిగంబర తీర్ధం అందించాక ఈమె ఏమాత్రం తక్కువ చేస్తానన్నా వెండితెర బెట్టుచేయదూ.. చూద్దాం ఏం చేస్తుందో!!