Begin typing your search above and press return to search.

మాజీ మిస్ ఇండియా మిలమిలలు!!

By:  Tupaki Desk   |   1 Oct 2017 4:14 AM GMT
మాజీ మిస్ ఇండియా మిలమిలలు!!
X
2007లో మిస్ ఇండియాగా ఎంపికైన ఈషా గుప్తా.. దశాబ్దకాలం గడిచినా ఇప్పటికీ తన అందాల మెరుపులను కంటిన్యూ చేస్తూనే ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో బాగానే పాతుకుపోయిన ఈ భామకు భారీ సినిమాల్లో కూడా బాగానే అవకాశాలు వస్తాయి. అంతగా తనకు ఛాన్సులు దక్కడానికి.. ఎలాంటి టెక్నిక్స్ పాటించాలో అవన్నీ ఈ సుందరాంగికి బాగా తెలుసు.

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఈషా గుప్తా ఓ ఫోటో షేర్ చేసింది. షోల్డర్ లెస్ పింక్ టాప్ లో అమ్మడు చూపిస్తున్న క్లీవేజ్ అందాలు.. మైమరిపించేయడంలో ఆశ్చర్యం లేదు. ముత్యాలు పొదిగిన ఆర్నమెంట్స్.. వంపులు తిరిగిన జుట్టు.. డ్రెస్ కి మ్యాచ్ అయ్యే లిప్ స్టిక్.. ఇలా ఎన్నెన్నో అట్రాక్షన్స్ ఆ ఫోటోలో ఉన్నాయి. అన్నిటికీ మించి.. దాదాపుగా కళ్లు మూసేసుకున్నా.. వాటిలో కనిపిస్తున్న మత్తు నుంచి బైటకు రావడం మాత్రం చాలా కష్టం. ఆ కళ్లకు మేకప్ వేసిన సంగతి తెలుస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా.. అమ్మడి మొహంలోకి తదేకంగా చూస్తూ.. మైమరచిపోవాల్సిందే.

ఇక ఈషా గుప్తా సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా బాద్షాహో చిత్రంలో నటించింది. తాజాగా తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ గా విడుదలైన సచిన్ మూవీ వీడెవడు చిత్రంలో కూడా నటించిన ఈషా చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. హెరా ఫెరీ3.. ఆంఖే2 చిత్రాలలో తన అందాలతో అభిమానులకు కనువిందు చేసేందుకు ప్రిపేర్ అయిపోతోంది ఈషాగుప్తా.