Begin typing your search above and press return to search.
ఇది మెగా సర్జికల్ స్ట్రైక్ అట..
By: Tupaki Desk | 11 Jan 2017 12:39 PM GMTమెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో ‘ఖైదీ నెంబర్ 150’తో అందరికీ తెలిసొచ్చేలా ఉంది. రీమేక్ కావడంతో ముందు ఈ సినిమాపై జనాల్లో అంత ఆసక్తి ఉంటుందా అని సందేహం వ్యక్తం చేశారు కానీ రిలీజ్ దగ్గర పడేసరికి హైప్ మామూలుగా లేదు. అందులోనూ రిలీజ్ రోజయితే చిరు సినిమా ప్రకంపనలు రేపుతోంది. క్లాస్ సినిమాలకే పట్టం కడతారని పేరున్న అమెరికాలో సైతం ‘ఖైదీ నెంబర్ 150’ కోసం అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. ఇంకా ప్రిమియర్ కలెక్షన్ల ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది కానీ.. ప్రస్తుతానికి ట్రెండ్స్ చూస్తుంటే అక్కడ బాహుబలి రికార్డును కూడా కొట్టేసేలా ఉంది చిరు సినిమా.
ఈ రోజు ఉదయానికి అందిన రిపోర్ట్స్ ప్రకారం ప్రిమియర్ కలెక్సన్లు 1.13 మిలియన్లకు చేరుకున్నాయి. బాహుబలి 1.3 మిలియన్లతో అగ్రస్థానంలో ఉంది. నాన్-బాహుబలి రికార్డును అలవోకగా కొట్టేసిన ‘ఖైదీ నెంబర్ 150’ ఫైనల్ లెక్కలు తేలాక ‘బాహుబలి’ని కూడా అధిగమించేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో.. కర్ణాటకలో చిరు సినిమా హంగామా మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపుగా 90 శాతం థియేటర్లలో ‘ఖైదీ నెంబర్ 150’నే ఆడిస్తున్నారు. ముందు రోజు వరకు కొంచెం ఆచితూచి వ్యవహరించిన ఎగ్జిబిటర్లు.. ఒక్క రోజైనా చాల్లే అని బుధవారం అన్ని థియేటర్లలో ‘ఖైదీ నెంబర్ 150’నే ఆడించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లు అనూహ్యంగా ఉంటాయని భావిస్తున్నారు. గ్రాస్ వసూళ్లు రూ.40 కోట్ల దాకా ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ ఫినామినాను మెగా అభిమానులు ‘మెగా సర్జికల్ స్ట్రైక్’ అని అభివర్ణిస్తూ.. ట్విట్టర్లో ఆ పేరుతో హ్యాష్ ట్యాగ్ తో సందడి చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/