Begin typing your search above and press return to search.
సర్దార్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత?
By: Tupaki Desk | 6 April 2016 9:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ షేకైపోతుందంతే. పవన్ చివరగా హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ అప్పటి ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఐతే ఇప్పుడు పవన్ ముందు పెద్ద పెద్ద టార్గెట్లే ఉన్నాయి. బాహుబలి రికార్డుల్ని పవనే కాదు.. ఎవ్వరూ టచ్ చేయలేని పరిస్థితి. ఐతే బాహుబలి ఓవరాల్ రికార్డుల్ని పక్కనబెట్టేస్తే.. తెలుగు రాష్ట్రాల వరకు ఆ సినిమా నెలకొల్పిన రికార్డుల్ని పవన్ అధిగమించడానికి అవకాశాలు లేకపోలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మీద ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ‘శ్రీమంతుడు’తో పాటు ‘బాహుబలి’ లెక్కల్ని కూడా చెరిపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
బాహుబలి కంటే కూడా అధిక సంఖ్యలో థియేటర్లలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను రిలీజ్ చేస్తుండటం.. భారీగా బెనిఫిట్ షోలు.. అదనపు షోలు వేస్తుండటంతో ఫస్ట్ డే కలెక్షన్లు అనూహ్యంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల షేర్ రావచ్చని.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూ.20 కోట్లు కలెక్టయ్యే అవకాశముందని లెక్కలు కడుతున్నారు ట్రేడ్ పండితులు. అదే జరిగితే ‘బాహుబలి’ని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మించేయడం ఖాయం. ‘బాహుబలి’ తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు కాస్త పైచిలుకు షేర్ వచ్చినట్లు అంచనా. ఇక తొలి వీకెండ్ మొత్తంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రూ.50 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమాకు టాక్ ఎలా ఉన్నప్పటికీ.. దీని మీద ఉన్న హైప్ ప్రకారం వీకెండ్ వసూళ్ల వరకు ఢోకా ఏమీ ఉండదు. టాక్ ను బట్టి వీకెండ్ తర్వాత వసూళ్లు ఆధారపడి ఉంటాయి.