Begin typing your search above and press return to search.
ట్రైలర్: యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూర్య 'ఈటీ'
By: Tupaki Desk | 2 March 2022 8:59 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ''ఈటీ'' (ఎత్తారెక్కుమ్ తునిందవన్). 2022 మార్చి 10వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.
తెలుగులో సూర్య చిత్రాన్ని ''ఈటీ'' (ఎవరికీ తలవంచడు) అనే పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
'వాడేమో సైంటిస్ట్ కావాలని ఆశ పడ్డాడు.. వేరే విధంగా అవ్వాలని నేను ఆశ పడ్డాను.. కానీ కాలం దైవం వాడ్ని ఇలా చూడాలని ఆశ పడ్డాయి' అనే వాయిస్ ఓవర్ తో 'ఈటీ' ట్రైలర్ ప్రారంభమైంది. ఇది పూర్తిగా యాక్షన్ అండ్ మాస్ యాంగిల్ లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్థమౌవుతుంది.
అంతేకాదు మహిళలపై జరుగుతున్న దాడులను దారుణాలను, అన్యాయాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. ఎప్పటి లాగా సూర్య తన నటనతో ఇరగదీశాడు. సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది.
సత్యరాజ్ - సూరి - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - వినయ్ రాయ్ - సుబ్బు పంచు - దేవదర్శిని - ఎం.ఎస్ భాస్కర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. డి. ఇమ్మాన్ అందించిన నేపథ్య సంగీతం.. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది సూర్య కెరీర్ లో 40వ సినిమా. 'ఆకాశమే హద్దురా' 'జై భీమ్' వంటి బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీ బ్లాక్ బస్టర్స్ తర్వాత సూర్య నుంచి రాబోతున్న ''ఈటీ'' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ అగ్ర కథానాయకుడుకి ఎలాంటి బాక్సాఫీస్ విజయాన్ని అందిస్తుందో చూడాలి.