Begin typing your search above and press return to search.

వీడియో: RRR నుండి అద్భుతమైన గీతం.. 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా'

By:  Tupaki Desk   |   14 March 2022 1:40 PM GMT
వీడియో: RRR నుండి అద్భుతమైన గీతం.. నెత్తురు మరిగితే ఎత్తర జెండా
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన RRR మూవీ.. ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. విడుదలకు రెండు వారాలే ఉండటంతో మేకర్స్ తిరిగి ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

ఇప్పటివరకు 'ఆర్ ఆర్ ఆర్' నుంచి వచ్చిన టీజర్లు - ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పాటలన్నీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలో తాజాగా 'ఎత్తారా జెండా' అనే ప్రమోషనల్ గీతాన్ని మేకర్స్ ఆవిష్కరించారు.

'పరాయి పాలనపై కాలు దువ్వి.. కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమర వీరులను తలచుకుంటూ..' అంటూ ప్రారంభమైన 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇందులో రామ్ చరణ్ - ఎన్టీఆర్ మరియు హీరోయిన్ అలియా భట్ ల డాన్స్ ప్రత్యేకంగా నిలిచింది. దేశభక్తిని చాటిచెప్పేలా పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్ లో తారక్ - చరణ్ అలరించారు.

'ఎత్తర జెండా' పాటకు ఎమ్ ఎమ్ కీరవాణి జాయ్ ఫుల్ ట్యూన్ అందించారు. విశాల్ మిశ్రా - పృథ్వీ చంద్ర - సాహితి చాగంటి - హారిక నారాయణ్ కలిసి ఈ ఆర్ ఆర్ ఆర్ అంతెమ్ ను ఆలపించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు.

డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఈ మ్యూజిక్ వీడియోకి కాన్సెప్ట్ డిజైన్ చేయగా.. హరీష్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగుతో పాటుగా హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో వచ్చిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి 'ఎత్తరా జెండా' పాటను RRR లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లా ఉంచాలని జక్కన్న ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే అన్ని పాటలు వదిలేయడం.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై హైప్ పెంచడానికి ముందుగానే ఈ గీతాన్ని ప్రేక్షకులకు అందించారు.

కాగా, విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన ఫిక్షనల్ స్టోరీతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ - రామ్ చరణ్‌ కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు.

బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవ్‌ గణ్‌ - శ్రియా శరన్ - సముద్ర ఖని - రాజీవ్ కనకాల - రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కె.కె. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాశారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో RRR చిత్రాన్ని నిర్మించారు. 'బాహుబలి' వంటి విజువల్ వండర్ తర్వాత తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కావడంతో యావత్ సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం ఈ సినిమా కోసం 'డాల్బీ' టెక్నాలజీను వాడబోతున్నారు. డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా 'ఆర్ ఆర్ ఆర్' నిలవబోతోంది. మరి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.