Begin typing your search above and press return to search.

యూర‌ప్ వ‌ర్సెస్ బాద్ షా.. వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌డు!!

By:  Tupaki Desk   |   29 May 2021 11:30 AM GMT
యూర‌ప్ వ‌ర్సెస్ బాద్ షా.. వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌డు!!
X
యూర‌ప్ దేశాల‌తో బాలీవుడ్ క‌నెక్ష‌న్ ఈనాటిది కాదు. రాజ్ క‌పూర్ రోజుల నుంచి కొన‌సాగుతున్న‌దే. దానికి కొన‌సాగింపుగా ఖాన్ ల త్ర‌యం స‌హా నేటిత‌రం స్టార్లంతా యూర‌ప్ దేశాల్లో షూటింగులు అంటే ఉవ్విళ్లూర‌తారు. నేటిత‌రం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు యూర‌ప్ అందాల్ని త‌మ సినిమాల్లో చూపించాల‌ని త‌హ‌త‌హ క‌న‌బ‌రుస్తారు. అందుకే యూర‌ప్ టూరిజానికి బాలీవుడ్ పెద్ద ఊత‌మందించే క‌ల్ప‌త‌రువుగా మారింది. ఇక బాలీవుడ్ సినిమాల‌కు యూర‌ప్ దేశాల్లో ట్యాక్స్ ఫ్రీ స‌దుపాయం పెద్ద బెనిఫిట్ అనే చెప్పాలి.

టాప్ 10 ఐకానిక్ బాలీవుడ్ సినిమాలు సుందరమైన యూర‌ప్ దేశాలలో చిత్రీకరించినవే. దిల్వాలే దుల్హానియా లే జాయేంగే-కుచ్ కుచ్ హోతా హై (కె 2 హెచ్ 2) మొద‌లు ఎన్నో ఉన్నాయి. కహో నా ప్యార్ హై-కబీ ఖుషి కభీ ఘం (కె 3 జి)-కల్ హో నా హో-జిందగి నా మిలేగి దోబారా-సంగీత తార-బచ్నా ఏ హసీనో ఇవ‌న్నీ విదేశీ లొకేష‌న్ల‌లో విరివిగా షూటింగులు జ‌రుపుకున్నాయి. స్విట్జ‌ర్లాండ్- ప్యారిస్- గ్రీస్- ఫ్రాన్స్- బెల్జియం స‌హా ఎన్నో యూరోపియ‌న్ దేశాల్లో అంద‌మైన లొకేష‌న్ల‌కు నిరంత‌రం బాలీవుడ్ పయ‌నిస్తూనే ఉంటుంది.

షారూక్ డీడీఎల్ జే సంచ‌ల‌నాలు తెలిసిందే. ఈ సినిమాలో క‌నిపించే ప‌చ్చందాలు అద్భుత లొకేష‌న్లు ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. గొప్ప ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు అయిన స్విట్జ‌ర్లాండ్ లో డీడీఎల్ జే మెజారిటీ చిత్రీక‌ర‌ణ‌ను చేశారు. ఇక ఆ త‌ర‌వాత షారూక్ న‌టించిన చాలా సినిమాల‌కు యూరోపియ‌న్ దేశాల లొకేష‌న్లు సెంటిమెంటుగా మారింది.

తాజాగా షారూక్ న‌టిస్తున్న ప‌ఠాన్ చిత్రాన్ని కూడా యూరోపియ‌న్ దేశాల్లోనే చిత్రీక‌రిస్తున్నారు. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూడు యూరోపియన్ దేశాలలో చిత్రీకరించనున్నారు. ఆ మూడు దేశాలు ఏవి.. ఈ షెడ్యూల్ ఎప్పుడు జరుగుతుంది? అన్న‌ది త‌దుప‌రి టీమ్ వెల్ల‌డించ‌నుంది. ఇవన్నీ యూరోపియన్ యూనియన్ లో ప్ర‌యాణాల‌ నియ‌మ‌ నిబంధనలపై ఆధారపడి ఉంటుంద‌ని తెలిసింది.

అలాగే నిర్మాత ఆదిత్య చోప్రా యూనిట్ సభ్యులకు పూర్తిగా టీకాలు వేయాలని భావిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల విదేశీ ప్ర‌యాణాల‌కు టీకా తప్పనిసరి. అయితే భార‌త‌దేశంలో టీకా వేగం ప్రస్తుతం నెమ్మదిగా ఉంది. అయినప్పటికీ కొన్ని వారాల్లో పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. టీకాల పూర్తి డోస్ ను పూర్తి చేసిన ఐరోపా నుండే కొంతమంది సిబ్బందిని ఎంపిక చేయాల‌ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది.

ప‌ఠాన్ 60 శాతం షూట్ ఇప్ప‌టికే పూర్త‌యింది. మిగిలిన 40శాతం విదేశాల్లో సాగుతుంది. పఠాన్ ప్లానింగ్ అంతా యూనివ‌ర్శ‌ల్ రేంజులో ఉండాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారు. అందుకే యూర‌ప్ లొకేష‌న్ల‌లోనూ త‌దుప‌రి మెజారిటీ షూట్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇక షారూక్ సినిమాల‌కు యూర‌ప్ దేశాలు ఆల్వేస్ వెల్ కం చెబుతాయి. భారీ ప్యాకేజీలు తాయిలాల‌తో బాద్ షాని ఆక‌ర్షిస్తాయి. అందుకే ఇప్పుడు ప‌ఠాన్ కి కూడా ఆ దేశాలను ఎంపిక చేస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది.

షారుఖ్ ఖాన్- దీపికా పదుకొనే- జాన్ అబ్రహం తో పాటు ప‌ఠాన్ లో సల్మాన్ ఖాన్ నటించారు. పఠాన్ వైఆర్‌.ఎఫ్ గూఢ‌చారి విశ్వంలో ఒక భాగం. సూపర్ స్టార్స్ ఇద్దరూ కలిసి రావడంతో ఈ చిత్రంపై అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరాయి. పఠాన్ లో తన ప్రత్యేక ప్రదర్శనలో సల్మాన్ కి హెలికాప్టర్ లో ఎంట్రీ సీన్ ఉంటుందని స‌మాచారం.