Begin typing your search above and press return to search.

ఎవరు టాక్ బాగుంది కానీ

By:  Tupaki Desk   |   17 Aug 2019 6:34 AM GMT
ఎవరు టాక్ బాగుంది కానీ
X
అడవి శేష్ హీరోగా రెజీనా కెసెండ్రా ప్రధాన పాత్ర పోషించిన ఎవరు ఈ మధ్యకాలంలో దేనికీ రానంత డీసెంట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది, ఇంకా వీకెండ్ కి రెండు రోజులు ఉంది కాబట్టి ఇవి అయ్యాక స్టేటస్ మీద క్లారిటీ వస్తుంది. ఏ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ తో బుకింగ్ ట్రెండ్స్ తో నడుస్తున్న ఎవరుకి బిసి కేంద్రాల్లో ఆ స్థాయి స్పందన లేదని ట్రేడ్ రిపోర్ట్. హాలిడే అయినప్పటికీ ఫస్ట్ డే అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడలేదని టాక్ వచ్చాక ఈవెనింగ్ షోకి మంచి ప్రోగ్రెస్ కనిపించిందని చెబుతున్నారు.

మిక్స్డ్ టాక్ వచ్చిన శర్వానంద్ రణరంగం మొదటి రెండు రోజులు బాగానే రాబట్టాడు. శర్వా కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదయ్యాయని నిర్మాతలు ఫిగర్స్ తో సహా అధికారిక ప్రకటన ఇచ్చారు. దీనికి ఇవాళ రేపు చాలా కీలకంగా మారనున్నాయి. టాక్ సంగతి పక్కన పెడితే బిసి సెంటర్స్ లో రణరంగంకు ఎవరు కంటే కొంత బెటర్ కలెక్షన్స్ వస్తున్నాయట. అయితే ఇది ఇలాగే కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు

ఎవరు గురించి కానీ రణరంగం గురించి ఇప్పటికిప్పుడు ఖచితమైన నిర్ధారణకు రాలేం. గూఢచారి తరహాలో ఎవరు అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యే కంటెంట్ కాదు. ముఖ్యంగా మాస్ కు ఈ మర్డర్ మిస్టరీలు క్రాస్ కనెక్షన్ క్రైంలు అంతగా ఒంటబట్టవు. అందులోనూ స్టార్ డం ఉన్న క్యాస్టింగ్ కాకపోవడంతో బిసిలో ఎవరు వీక్ కావడానికి ప్రధాన కారణం. కానీ రణరంగం ఇదే తనకు అనుకూలంగా మార్చుకుంది. ఒకవేళ యునానిమస్ గా హిట్ టాక్ వచ్చి ఉంటే రేంజ్ ఇంకోలా ఉండేది. పరిస్థితిని గమనిస్తే ఫైనల్ గా ఎవరు గూఢచారి స్థాయి సక్సెస్ ని కానీ షేర్ ని కానీ అందుకుంటుందా లేదా అనేదే ట్రేడ్ లో మెదులుతున్న ప్రశ్న. దానికి తగ్గట్టే కొన్ని కేంద్రాల్లో డ్రాప్ ఉండటం గమనార్హం. సోమవారం నుంచి మొదలయ్యే అసలైన కలెక్షన్ల పరీక్షలో ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి ఎవరు గూఢచారిని మించిన సక్సెసా కాదా అనే కంక్లూజన్ కి రావొచ్చు