Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఎవర్ గ్రీన్ అందాల ఎవెలిన్

By:  Tupaki Desk   |   13 April 2019 3:59 AM GMT
ఫోటో స్టొరీ: ఎవర్ గ్రీన్ అందాల ఎవెలిన్
X
బాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఎవెలిన్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈ జెర్మనీ సుందరి 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'నౌటంకీ సాలా'.. 'ఏ జవాని హై దీవాని'.. 'హిందీ మీడియం'.. 'జబ్ హ్యారీ మెట్ సెజల్' లాంటి సినిమాల్లో నటించింది. అమ్మ జర్మన్.. నాన్న ఇండియన్ కావడంతో ఇంటర్నేషనల్ బ్యూటీలాగా కన్పిస్తుంది. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో గ్లోబల్ వార్మింగ్ కు ఈ భామ కూడా ఒక కారణమే. మరో విషయం ఏంటంటే ఈ భామ జర్మన్.. ఇండియన్ కాదు.

తాజాగా ఈ ఎవెలిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఒక బీచ్.. చుట్టూ కొండలు.. ఇసుకలో జస్ట్ అలా పడుకొని నవ్వింది. కానీ ఇన్నర్ లాగే ఉండే టాప్ కావడంతో చక్కనైన ఆమె పరువాలు కెమెరా కంటికి చిక్కాయి. అసలే గ్లోబల్ సుందరి.. ఇలాంటి పోజిస్తే నెటిజనులు ఏమైపోవాలి? అందుకే లైకులమీద లైకులుకొట్టి తమ జేజేలు తెలిపారు. ఈ ఫోటోకు ఎవెలిన్ ప్రేమ అని.. సూర్యుడు కాంతి అని ఏదో అర్థం కాని.. బాగా కష్టపడితే కానీ అర్థం చేసుకోలేని క్యాప్షన్ ఇచ్చింది. అయినా మన పిచ్చిగానీ ఆమె క్యాప్షన్ ను అర్థం చేసుకునేందుకు ఎంతమంది ప్రయత్నిస్తారు? సూర్యకాంతిలో మెరుస్తున్న ఆమె అందాలను కళ్ళతో జుర్రుకునేందుకు ప్రయత్నిస్తారు!

ఎవెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్ 'సాహో' లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ఫోటోలకే ఇలా అందాలను ఆరబోస్తే.. 'సాహో' సినిమాలో పాప గ్లామర్ పరిస్థితి ఏంటి? సుబ్బయ్య హోటల్ లోని విస్తరాకులో కూరలు వడ్డించినట్టు అన్నీ అందాలను టోకున వడ్డించడమే!