Begin typing your search above and press return to search.

మితి మీరిన...అభిమానం...ఇబ్బంది పడ్డ హీరోయిన్!

By:  Tupaki Desk   |   24 Feb 2019 5:10 AM GMT
మితి మీరిన...అభిమానం...ఇబ్బంది పడ్డ హీరోయిన్!
X
సహజంగా అభిమానం హద్దులు మీరితే ఇబ్బందులు తప్పవు...అది హీరోలకు అయినా....హీరోయిన్స్ కి అయినా...అయితే హీరోయిన్స్ విషయానికే వస్తే అది మరింత ఇబ్బందికర పరిణామమే...అవుతుంది. ఇక విషయంలోకి వెళితే, రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న సినిమా సాహో...ఆ సినిమాతో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ తెలుగులో తొలిసారిగా హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమాను సుజిత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంభందించి మరో బాలీవుడ్ భామ ఇవిలిన్ శర్మ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది. స్పై థ్రిలర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మూడు బాషల్లో...తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ చేసేలా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా లో ఇవిలిన్ శర్మ విషయంలో ఆమె ఫ్యాన్ చూపిన అత్యుత్సాహం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఒకరోజు ఈ భామ షూటింగ్ ను ముందుగానే ముగించుకుని హోటెల్ కి చేరుకున్న సమయంలో ఆమె కోసం ఆమె అభిమాని ఒకరు ఆమెను కలవడానికి ఆమె ఉండే హోటెల్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేశాడు...ఆమె హోటెల్ కి చేరగానే ఆమె రూమ్ నంబర్ తెలుసుకుని ఆమె ఉండే ఫ్లోర్ కి వెళ్ళడానికి ట్రై చేశాడు...ఇక విషయం తెలుసుకున్న ఇవిలిన్ శర్మ తన మ్యానేజర్ ను అలెర్ట్ చేసి, హోటెల్ సిబ్బంది సహాయంతో అతన్ని పంపించేసింది.

ఆయితే ఆమె ఆరోజు ఆరోగ్యం సరిగ్గా లేక, ఒత్తిడి వల్ల తన అభిమానిని అలా పంపించాల్సి వచ్చింది అని తర్వాత తెలిపింది. జరిగిన ఆ సంఘటన గురించి ఆమె మాట్లాడుతూ ఫాన్స్ అంటే మాకు చాలా ప్రాణం....అయితే ఒక్కోసారి మేమున్న పని ఒత్తిడిలో వారు మమ్మల్ని కలవాలి అని వచ్చినా కలవలేని పరిస్థితుల్లో ఉంటాం....నిజం చెప్పాలి అంటే వాళ్ళు వస్తే మేము చాలా ఆనందిస్తాం...ఆ విషయాన్ని ఫాన్స్ గుర్తించాలి..అంతే తప్ప ఫాన్స్ ని కాదనుకునే మనస్తత్వం మాత్రం తనది కాదు అని, చెప్పుకొచ్చింది ఈ భామ. మొత్తంగా అదీ మితి మీరిన అభిమానం చేసిన గాయం!