Begin typing your search above and press return to search.

బేబీ బంప్ తో 'సాహో' న‌టి హ‌ల్ చ‌ల్‌!

By:  Tupaki Desk   |   17 Jan 2023 4:30 PM GMT
బేబీ బంప్ తో సాహో న‌టి హ‌ల్ చ‌ల్‌!
X
బాలీవుడ్ టు కోలీవుడ్ వ‌ర‌కు క్రేజీ హీరోయిన్ ల‌తో పాటు క్రేజీ భామ‌లు బేబీ బంప్ ల‌తో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాము ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని వినూత్నంగా వెల్ల‌డిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంద‌డి చేస్తున్నారు. ఇదే త‌ర‌హాలో బాలీవుడ్ న‌టి ఎవెలిన్ శ‌ర్మ నెట్టింట బేబీ బంప్ ఫొటోల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

గ‌తంలో త‌ల్లైన ఎవెలిన్ శ‌ర్మ తాజాగా తాను మ‌రోసారి త‌ల్లిని కాబోతున్నాన‌ని బేబీ బంప్ తో వున్న ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఈ సంద‌ర్భంగా త‌ను బేబీ బంప్ తో వున్న ఫొటోల‌ను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన అబిమానులు, సెల‌బ్రిటీలు ఎవెలిన్ శ‌ర్మ‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. 2006లో హాలీవుడ్ మూవీ 'ట‌ర్న్ లెఫ్ట్'తో న‌టిగా కెరీర్ ప్రారంభించిన ఎవెలిన్ శ‌ర్మ ఆ త‌రువాత 2012లో 'ఫ్ర‌మ్ సిడ్నీ విత్ ల‌వ్‌' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నౌటంకీ సాలా, ఏ జ‌వానీ హై దివానీ, ఇష్క్‌, హిందీ మీడియం.. వంటి సినిమాల్లో న‌టించింది.

ఆ త‌రువాత ప‌లు హిందీ చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్ లో మెరిసింది. 2019లో ప్ర‌భాస్ న‌టించిన 'సాహో'తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఇందులో జెన్నీఫ‌ర్ గా న‌టించి ఆక‌ట్టుకున్న ఎవెలిన్ శ‌ర్మ బాలీవుడ్ లో ప్ర‌త్యేక గీతాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచి కుర్ర కారుని త‌న‌దైన గ్లామ‌ర్ తో విశేషంగా ఆక‌ట్టుకుంది. 2019లో 'ఎక్స్ రే: ది ఇన్న‌ర్ ఇమేజ్‌' వంటి థ్రిల్ల‌ర్ లోని ప్ర‌త్యేక గీతంలో క‌నిపించింది. అప్ప‌టి నుంచి సినిమాల‌కు దూరంగా వుంటోంది.

గ‌త కొంత కాలంగా బాయ్ ఫ్రెండ్ తుషాన్ భిండీతో ప్రేమ‌లో వున్న ఎవెలిన్ శ‌ర్మ అత‌న్నే 2021లో వివాహం చేసుకుంది. ఈ ఇద్ద‌రికి కామ‌న్ ఫ్రెండ్ మ‌రో న‌టి ఫంక్ష‌న్ లో తొలిసారి క‌లుసుకున్న ఈ జంట ఆ త‌రువాత ప్రేమ‌లో ప‌డింది. 2021 న‌వంబ‌ర్ లో వీరికి ముందుగా ఓ పాప పుట్టింది.

ఆ పాప‌కు అవ‌రానియా భిండీ అనే పేరు పెట్టారు. తాజాగా మ‌రోసారి ఎవెలిన్ శర్మ ప్రెంగ్నెంట్ అయింది. ఆ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ బేబీ బంప్ తో వున్న ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.