Begin typing your search above and press return to search.

వెయ్యి కోట్ల స్టార్‌ కూడా 'ఆచార్య' ని కాపాడలేక పోయాడు!

By:  Tupaki Desk   |   3 May 2022 6:30 AM GMT
వెయ్యి కోట్ల స్టార్‌ కూడా ఆచార్య ని కాపాడలేక పోయాడు!
X
చిరంజీవి, కొరటాల శివ కాంబో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో రామ్‌ చరణ్ కూడా నటిస్తున్నాడు అనే వార్తలు అంచనాలను మరింతగా పెంచాయి. ఆ అంచనాలను అందుకోవడంలో దర్శకుడు కొరటాల శివ దారుణంగా విఫలం అయ్యాడు. ఆచార్య సినిమా ప్లాప్‌ టాక్ ను దక్కించుకుని దారుణమైన వసూళ్లను నమోదు చేస్తోంది.

మొదటి మూడు రోజులు గౌరవప్రదమైన వసూళ్లు నమోదు అయినా కూడా సోమవారం నుండి సినిమా వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి. మంగళవారం అయిన నేడు రంజాన్‌ సెలవు ఉన్నా కూడా ఆచార్య కు బుకింగ్‌ పెద్దగా జరగడం లేదు. ఇప్పటికే సినిమా నిరాశ పర్చినట్లుగా టాక్‌ వచ్చిన నేపథ్యంలో అంత ఖర్చు పెట్టి మళ్లీ చూడటం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కాని పెద్దగా జనాలు సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదని తేలిపోయింది.

రంజాన్ హాలిడే ను ఆచార్య సద్వినియోగం చేసుకోవడంలో కూడా విఫలం అయ్యింది. సినిమా కు ఈ స్థాయి వసూళ్లు నమోదు అవుతాయని బయ్యర్లు కూడా భావించలేదు. వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా రాబడుతున్న వసూళ్లను చూస్తుంటే బయర్లు ఏ స్థాయిలో నష్టపో బోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో చిరంజీవి ఉన్నా కూడా జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టేందుకు సిద్ధంగా లేరు.

ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్ ఆర్ ఆర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఉన్నా కూడా జనాలకు పట్టింపు లేకుండా పోయింది. వెయ్యి కోట్లు సాధించిన సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్‌ స్టార్‌ నటించిన సినిమా అంటే ఆసక్తి ఏ స్థాయిలో ఉండాలి.. కాని ఆ ఆసక్తి జనాల్లో అస్సలు కనిపించడం లేదు. దాంతో ఆచార్య సినిమా వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఈ వారంలో జయమ్మ పంచాయితీ వస్తే ఆచార్య మరింతగా కనిపించకుండా పోతుందేమో అంటున్నారు.

ఈ వారంలో జయమ్మ పంచాయితీ రాబోతుండగా వచ్చే వారంలో సర్కారు వారి పాట సినిమా విడుదల కాబోతుంది. కనుక ఈ రెండు మూడు రోజులు మాత్రమే ఆచార్య ఏమైనా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కాని ఈ రెండు మూడు రోజులు కూడా ఆచార్య ను జనాలు పట్టించుకోవడం లేదు అంటూ సినీ విశ్లేషకులు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆచార్య కు చాలా పెద్ద నష్టం తప్పక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.