Begin typing your search above and press return to search.
క్రైసిస్ నుంచి కోలుకున్నా వేదనలోనే ఆర్టిస్టులు?!
By: Tupaki Desk | 14 Sep 2022 5:30 AM GMTకరోనా క్రైసిస్ చాలామంది పొట్టలు కొట్టింది. ఉపాధిని కుప్పకూల్చిడమే గాక కుటుంబ జీవనాన్ని అల్లకల్లోలం చేసింది. ఇక సినీపరిశ్రమపై కరోనా పంచ్ అంతా ఇంతా కాదు. కరోనా మొదటి వేవ్ .. ఆ తర్వాత రెండో వేవ్ లతో కొన్ని నెలల పాటు సినీఆర్టిస్టులు కార్మికులు ఉపాధిని కోల్పోయారు. దర్శకనిర్మాతలు టెక్నీషియన్లు పని లేకుండా ఖాళీగానే ఉన్నారు. ఇక ఈ సంధి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు రెవెన్యూ లేకపోవడంతో తమ లగ్జరీలకు ఇతర ఖర్చులకు ఇబ్బంది పడ్డారు. పనిమనుషుల జీతాలకు చెల్లించుకోలేని ధైన్యంలోకి వెళ్లారు.
కొందరు ఆర్టిస్టులు అయితే జీతాలు చెల్లించలేక తమవద్ద పనివాళ్లను కూడా తొలగించారు. రెండేళ్ల పాటు ఇదే ధైన్యం కొనసాగింది. కరోనా ఇప్పటికి నెమ్మదిగా దూరమైంది. రెండు డోస్ ల వ్యాక్సిన్లు పని చేసాయి. బూస్టర్ డోస్ తో మరింత సురక్షితం అయ్యారు. ఇక సినీపరిశ్రమలో బంద్ లు వగైరా బంధనాలు తొలగిపోయి సుఖంగా షూటింగులు చేస్తుండడంతో తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుల కష్టాలు తొలగిపోయాయి. లక్షల్లో పారితోషికాలు ఇకపై కళ్ల జూడబోతున్నారు.
అయితే ఇటీవల నిర్మాతల గిల్డ్ - నిర్మాతల మండలి - ఛాంబర్ సంయుక్తంగా నటీమణుల స్టాఫ్ కి కోతలు వేయడంతో దానిపై కొందరు తీవ్రంగా అలిగారని కూడా గుసగుస వినిపిస్తోంది. ఈ కొత్త పోకడ తమకు డైజెస్ట్ కావడం లేదట. కరోనా సమయంలో అసలేమీ లేకుండా జీరో రెవెన్యూతో అప్పుల పాలైన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే మళ్లీ ఈ దెబ్బేమిటీ? అంటూ వాపోతోందిట. మలయాళం నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఒక కథానాయిక..
కన్నడ నుంచి వచ్చి ఇక్కడ ఎదిగేసిన పెద్ద యువనాయికకు కూడా ఈ తిప్పలేంటీ అంటూ కలత చెందుతున్నారట. ఇక స్టార్ యాంకర్ గా కొనసాగి ప్రముఖ నటిగా మారిన ఒకరు కూడా ఈ కొత్త ఇబ్బందికి కలత చెందారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరో అప్ కమ్ యాంకర్ కథానాయికగా ప్రయత్నాల్లో ఉంది. తాజా పంచ్ తో ఇప్పుడు తన రెమ్యునరేషన్ నుంచే పనివాళ్లకు డబ్బు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన చెందుతోందట. ఇంతకుముందు నిర్మాతలనే ఏదోలా బాదేయాలని చూసేవారు.
పనోళ్లను అలా అలా మ్యానేజ్ చేసేసేవారు. కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. స్ట్రిక్ట్ రూల్ పాసవ్వడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. తమ పారితోషికాల నుంచే వ్యక్తిగత స్టాఫ్ కి చెల్లించాలన్న నిబంధన చాలా మంది అగ్ర కథానాయికల కంటే మీడియం రేంజ్ నటీమణులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోందట. మేకప్ మేన్ - డ్రైవర్- గొడుగు పట్టేవాడు- విసనకర్ర విసిరేవాడు- మమ్మీ- సిస్టర్- బోయ్ ఫ్రెండ్... ఈ గోలంతా ఇక సెటిలవుతున్నట్టే!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.