Begin typing your search above and press return to search.

దీపావళి సినిమాలు కూడా అక్కడ వెలుగులు నింపలేదు!

By:  Tupaki Desk   |   26 Oct 2022 10:10 AM GMT
దీపావళి సినిమాలు కూడా అక్కడ వెలుగులు నింపలేదు!
X
బాలీవుడ్ లో కరోనా సమయం నుండి ఇప్పటి వరకు పరిస్థితి మారడం లేదు. టాలీవుడ్ మరియు ఇతర సినీ ఇండస్ట్రీలో కరోనా సమయంలో కష్టాలు తప్పలేదు. కానీ మెల్ల మెల్లగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. కానీ బాలీవుడ్‌ లో మాత్రం పరిస్థితులు మారకుండా అప్పటి పరిస్థితులే కొనసాగుతూ వచ్చాయి.

ఈ రెండున్నర సంవత్సరాలుగా బాలీవుడ్‌ లో సూపర్ హిట్‌ సినిమాలు.. చెప్పుకోదగ్గ హిట్ సాధించిన సినిమాలు ఏంటీ అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. మరీ ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉండటంతో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ప్రతి శుక్రవారం ఆశలు పెట్టుకుని ఈ వారం ఏమైనా మార్పు వస్తుందేమో అంటూ గమనిస్తూ వస్తున్నారు.

దీపావళి సందర్భంగా హిందీ ప్రేక్షకుల ముందుకు అక్షయ్‌ కుమార్ నటించిన రామ్‌ సేతు మరియు అజయ్ దేవగన్ నటించిన థాంక్యూ గాడ్‌ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆహా ఓహో అన్నట్లుగా లేవు అని చెప్పాలి.

రామ్‌ సేతు సినిమా పై బాలీవుడ్‌ వర్గాల వారు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్షయ్‌ కుమార్‌ గతంలో తన ప్రతి సినిమా తో వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. ఈ సినిమా కాన్సెప్ట్‌ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు తప్పకుండా ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరిస్తుందని అంతా భావించారు.

ఇటీవల నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రామ్‌ సేతు సినిమా కూడా అక్కడ అదే స్థాయిలో టాక్ ను సొంతం చేసుకుని ఈజీగా వంద కోట్లను రాబడుతుందని భావించారు. కానీ ఫలితం తారుమారు అయ్యింది. బాలీవుడ్ కి దీపావళి సినిమాలు కూడా వెలుగు లు తీసుకు రాలేక పోయాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.