Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ని దేవుడు కూడా కాపాడలేకపోయాడు..!
By: Tupaki Desk | 27 Oct 2022 10:30 AM GMT100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇండియన్ సినిమాల్లో ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ పరిశ్రమ విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కుంటుందని చెప్పొచ్చు. ఒకప్పుడు అక్కడ స్టార్ సినిమాలు రిలీజైతే బాక్సాఫీస్ కళకళలాడేది.
కానీ కరోనా తరావత సీన్ మొత్తం మారిపోయింది. స్టార్ సినిమాలకు కనీసం మొదటి రోజు 20 శాతం ఆక్యుపెన్సీ కూడా జరగట్లేదు. స్టార్ సినిమా కాదు అసలు సినిమాలనే చూడటం మానేశారు హిందీ ఆడియన్స్. అయితే ఈ క్రమంలో తెలుగు సినిమాలు మాత్రం అక్కడ వరుస రికార్డులు సృష్టిస్తున్నాయి.
అదేంటి మన ఆడియన్స్ మన సినిమాలకు రావట్లేదు కానీ సౌత్ సినిమాలను చూస్తున్నారని అక్కడ స్టార్ హీరోలు డైలమాలో పడ్డారు. హిందీ ఆడియన్స్ కొత్త కంటెంట్ కోరుతున్నారు. పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలను తిప్పి కొడుతున్నారు.
ఈ లాజిక్ ని అర్ధం చేసుకోని బాలీవుడ్ మేకర్స్ రొటీన్ సినిమాలను తీసి వారిపై రుద్దాలని చూస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. బాలీవుడ్ లో ప్రతి శుక్రవారం ఓ అగ్ని పరీక్ష జరుగుతుంది. ఈమధ్య వచ్చిన సినిమాల్లో కాశ్మీర్ ఫైల్స్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1, గంగూబాయ్ కటియావాడి తప్ప మిగతా సినిమాలేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వట్లేదు. స్టార్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడిన పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ గా రిలీజైన మరో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచాయి. అందులో ఒకటి అక్షయ్ కుమార్ రామ్ సేతు కాగా.. మరొకటి సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన థ్యాంక్ గాడ్ సినిమాలు ఉన్నాయి.
అక్షయ్ కుమార్ రామ్ సేతు మొదటి షోతోనే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక థ్యాంక్ గాడ్ విషయానికి వస్తే తేజాబ్, దిల్ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన డైరక్టర్ ఇంద్ర కుమార్ పాతికేళ్ల తర్వాత రొటీన్ కథతో ఈ సినిమా తీశాడు. తెలుగు, తమిళ పరిశ్రమలో ఎప్పుడో వచ్చిన యముడు కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది.
సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమాలో తన మార్క్ చూపించాలని ఎంత ప్రయత్నించినా స్టోరీ రొటీన్ గా ఉండేసరికి వర్క్ అవుట్ అవలేదు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ చిత్రగుప్తుడుగా నటించాడు. థ్యాంక్ గాడ్ అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హడావిడి చేద్దామని చూసిన వారికి పెద్ద షాక్ తగిలింది. అతేకాదు బాలీవుడ్ ని ఈసారి దేవుడు కూడా కాపాడలేకపోయాడని చెప్పుకోవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.