Begin typing your search above and press return to search.

సల్మాన్ పెళ్లిపై తన తండ్రి అసహనం ఇది!

By:  Tupaki Desk   |   15 Aug 2016 8:16 AM GMT
సల్మాన్ పెళ్లిపై తన తండ్రి అసహనం ఇది!
X
బాలీవుడ్ లో సరదాగా ఒక చర్చ నడుస్తుండటంతోపాటు.. ఎప్పటికీ జరగదని చెప్పే విషయంలో ఆ విషయాన్ని ఉదాహరణగా చెబుతుంటారట! అదేమిటో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.. అదే సల్మాన్ పెళ్లి! తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావురా అంటే.. సల్మాన్ పెళ్లవగానే ఇచ్చేస్తాను బ్రదర్ అని జోకులు వేసుకుంటున్నారంటే సల్మాన్ పెళ్లి బాలీవుడ్ జనాల్లో ఏస్థాయి హాట్ టాపిక్కో ఇట్టే అర్ధమవుతుంది. ఈ విషయంపై ఇప్పటివరకూ సల్మాన్ కే కాదు ఎవ్వరికీ క్లారిటీ లేదనేది ఎక్కువమంది చెప్పే విషయం. అయితే తాజాగా సల్మాన్ పెళ్లి విషయంపై అతడి తండ్రి సలీం ఖాన్ స్పందించారు.

ఇప్ప‌టికే చాలాసార్లు స‌ల్మాన్ పెళ్లిపై ప్ర‌శ్న‌లు ఎదుర్కొని సహనంగా సమాదానాలు చెప్పిన స‌లీం ఖాన్‌ కు తాజాగా ట్విట్ట‌ర్ లో ఇదే ప్ర‌శ్న ఎదురయ్యింది. దీంతో సహనం కోల్పోయారో, కొడుకు పెళ్లిపై ఆశవదులుకున్నారో కానీ.. "సల్లూభాయ్‌ పెళ్లెప్పుడవుతుంది?" అంటూ ప్రశ్నించిన అభిమానికి.. "సల్మాన్‌ పెళ్లి గురించి నన్నేమీ అడగొద్దు.. ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతుందో దేవుడికి కూడా తెలీదు. ఇక దాని గురించి నేనేం చెప్పగలను" అని సమాధానం చెప్పారు. దీంతో సల్మాన్ పెళ్లివిషయంలో అభిమానులే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా ఏస్థాయి అసహనంతో ఉన్నారో ఇట్టే అర్ధమవుతుంది.

సుమారు 20 ఏళ్లనుంచి దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హోదాను మోస్తున్న సల్మాన్.. ఎప్పటికప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ను మారుస్తూవస్తున్నాడే తప్ప పెళ్లి మాత్రం చేసుకోవడంలేదు. మిగిలిన బాలీవుడ్ హీరోయిన్స్ సంగతి పక్కనపెడితే.. తాజాగా రుమేనియాకు చెందిన మోడల్ లూలియా వాంటూర్ తో ప్రేమాయణం సాగిస్తున్న సల్మాన్.. ఈమె విషయంలో మాత్రం కొంచెం సీరియస్ గా ఉన్నాడని, త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం సాగుతుంది. ఇదే క్రమంలో లూలియా వాంటూర్ తో కలిసి దలైలామాను కూడా కలవడంతో ఈ విషయంపై అభిమానులకు కాస్త నమ్మకం పెరిగిందని అంటున్నారు. కాగా.. స‌ల్మాన్ ఈ మ‌ధ్య త‌న పెళ్లి మీద త‌నే సెటైర్ వేసుకున్న సల్మాన్... ఎప్పుడు అడిగినా న‌వంబ‌ర్లో పెళ్లి న‌వంబ‌ర్లో పెళ్లి అంటూ ఇప్ప‌టికి సుమారు 20 నుంచి 25 న‌వంబ‌ర్లు వెళ్లిపోయాయ‌ని.. ఏ న‌వంబ‌ర్లో త‌న పెళ్ల‌వుతుందో త‌న‌కే తెలియ‌ద‌ని అన్నాడు. ఇప్పుడు స‌ల్మాన్ తండ్రి స‌లీం ఖాన్ లైన్లోకి వచ్చి త‌న కొడుకు పెళ్లిపై ఈ రేంజ్ లో సెటైర్లు వేశాడు.