Begin typing your search above and press return to search.
'అవతార్ -2' డిజాస్టర్ అయినా 35 కోట్లు పక్కా!
By: Tupaki Desk | 1 Dec 2022 11:30 PM GMT'అవతార్ -2' 'ది వే ఆఫ్ వాటర్' రిలీజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 16 రిలీజ్ కౌండ్ టౌన్ మొదలవ్వడంతో డే బై డే అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జెమ్స్ కామోరూన్ వెండి తెరపై ఎలాంటి వండర్ సృష్టించారని అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల తర్వాత అవతార్ -2 ప్రేక్షకుల ముందుకు రావడంతో? కామెరూన్ ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు? అన్న అంశంపై ఓ సెక్షన్ ఆడియన్స్ లో పెద్ద ఎత్తున బెట్టింగ్స్ సైతం జరుగుతున్నాయి.
మెట్రో పాలిటన్ సిటీస్ నుంచి చిన్న పట్టణాల వరకూ అన్ని వర్గాల ఆడియన్స్లో అవతార్-2 టాపిక్ ఇప్పుడు తప్పనిసరైంది. మారుమూల గ్రామాల్లో సైతం ఓ హాలీవుడ్ సినిమా గురించి చర్చించుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఇక తెలుగు రాష్ర్టాల పరంగా చూసుకుంటే? మిగతా రీజియన్స్ తో పోల్చుకుంటే? ఇంకాస్త ప్రభావం అధికంగానే ఉంటుంది.
రెండు రాష్ర్టాల ప్రేక్షకాభిమానులు రిలీజ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుందో? అదే తరహా ఉత్సాహం అవతార్ -2 విషయంలో నెలకొంది. సన్నివేశం చూస్తుంటే? అవతార్ -2 థియేటర్లను అలంకరించడం ఒక్కటే తక్కువగా కనిపిస్తుంది. ఈ క్రేజ్ నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల్లో సినిమా భారీ ఎత్తునే బిజినెస్ చేసి ఉంటుందని తెలుస్తుంది.
ఈనేపథ్యంలో ఎలాంటి పోటీ ఉన్నా అవతార్-2 డిజాస్టర్ అయినా తెలుగు రీజియన్స్ నుంచి 35 కోట్ల వరకూ వసూళ్ల రాబడుతుందని ఓ అంచనా. ఆ స్థాయిలో అవతార్-2 బిజినెస్ లో దూసుకుపోయింది. ఈనెలలో స్టార్ హీరోల చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు. ఇంకా చెప్పాలంటే అవతార్ -2 నే చాలా రిలీజ్ లకు ఆటకం కలిగించే ఛాన్స్ ఉంది. అవతార్ -2పై ఉన్న బజ్ మరే చిత్రంపై లేదు. చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేవి కూడా ఈనెలలో రిలీజ్ కాలేదు.
కొన్ని లో బడ్జెట్ చిత్రాలు మినహా స్టార్స్ ఎవరూ రావడం లేదు. వాటిపై అవతార్ -2 ప్రభావం అయితే చాలా వరకూ ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే ప్రేక్షకుల మొదటి ఛాయిస్ అవతార్-2 నే అవుతుంది. అవతార్ కి టిక్కెట్లు దొరకని వాళ్లు అందుబాటులో ఉన్న సినిమాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్ర్కీన్ లో అవతార్ ఏకంగా ఏడాది ఆడింది. డైలీ షోలు అన్ని ఫుల్ అయ్యేవి. ఆ లెక్కన అవతార్-2 హిట్ టాక్ తెచ్చుకుంటే? ఇంకే స్థాయిలో ఆదరణకు నోచుకుంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. ఇప్పటికే టిక్కెట్ ధర 1500 వరకూ ఉంటుందని ఉహాగానాలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.