Begin typing your search above and press return to search.
అతడితో డేటింగ్ లో ఉన్నా.. పెళ్లి వరకు వెళ్తుందో లేదో తెలియదు
By: Tupaki Desk | 19 March 2021 5:30 AM GMTఉత్తరాది సెలబ్రెటీల్లో డేటింగ్.. లవ్.. బ్రేకప్ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. డేటింగ్ చేసిన వారు ప్రేమించుకున్న వారు పెళ్లి వరకు వెళ్లాలని ఏమీ లేదు. బాలీవుడ్ ప్రేమ జంటలు చాలా వరకు ప్రేమ వరకు వచ్చి ఆగిపోయాయి. ప్రస్తుతం బుల్లి తెర సెలబ్రెటీ నియా శర్మ టీవీ నటుడు రాహుల్ సుధీర్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా ఒప్పుకుంది. ప్రస్తుతం తామిద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం. ఇద్దరం మంచి టైమ్ ను గడుపుతున్నాం. డేటింగ్ లో ఉన్న మేమిద్దరం పెళ్లి చేసుకుంటామా అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేను. లాంగ్ రిలేషన్ షిప్ ను నేను కోరుకుంటున్నా కొన్ని కారణాల వల్ల అది సాగడం లేదు. ప్రతి ఒక్కరితో కూడా నాకు నిరాశే ఎదురవుతోంది.
లైఫ్ పార్టనర్ ను ఎంపిక చేసుకునేందుకు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరితో ఉన్నప్పుడైతే ఇతడే నా లైఫ్ పార్టనర్ అని ఖచ్చితమైన న్మకం వస్తుందో అప్పుడు అతడిని పెళ్లి చేసుకుంటాను అంది. ప్రస్తుతం రాహుల్ సుధీర్ తో డేటింగ్ లో ఉన్నారు కదా అతడితో పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయంలో నియా శర్మ ఈ సమాధానం ఇచ్చింది. ఎంతో మంది సెలబ్రెటీలు ప్రేమించుకుని పెళ్లి వరకు వెళ్లకుండా విడిపోతున్నారు. అందుకే ప్రేమకు ముందే అన్ని విషయాల్లో క్లారిటీ ఉండాలని నియా శర్మ చెప్పుకొచ్చింది.
ఇక తన ప్రేమ మరియు పెళ్లి విషయాలను చాలా ప్రైవసీగా ఉంచాలని భావిస్తుందట. ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా అని చెప్పి ఇది పెళ్లి వరకు వెళ్తుందో లేదో అని నియా చేసిన బోల్డ్ వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పద్దతి అమెరికా వంటి దేశాల్లో ఉంది. ఇండియాలో నియా దీన్ని పాటిస్తుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.