Begin typing your search above and press return to search.

ఇప్పుడే కాదు అప్ప‌ట్లో కూడా డైరెక్ట‌ర్ కు చెప్పేవాళ్లున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   22 Jan 2023 5:30 AM GMT
ఇప్పుడే కాదు అప్ప‌ట్లో కూడా డైరెక్ట‌ర్ కు చెప్పేవాళ్లున్నార‌ట‌!
X
తొలి రోజుల‌లో టాలీవుడ్ సినిమాకు.. ఈ రోజుల్లో టాలీవుడ్ మూవీకి చాలా వ్య‌త్యాసం వుంది. ఇప్పుడు హీరోకు స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోతే వెంట‌నే ద‌ర్శ‌కుడు మార్పులు చేర్పులు చేయాల్సిందే. కానీ అప్ప‌ట్లో మాత్రం ద‌ర్శ‌కుడు చెప్పిందే వేదంగా పాటించే వార‌ట అంతా. అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు అంటే ప్ర‌త్యేక గౌర‌వంతో చూసేవారు. గురు భావం, భ‌యం భ‌క్తితో త‌ను చెప్పింది చెప్పిన‌ట్టుగా చేసేవారు. త‌ను ఓ లెక్చ‌ర‌ర్ అయితే ఆర్టిస్ట్ లు అంతా స్టూడెంట్స్ లా మారి త‌ను చెప్పిన ప్రతీదీ తూచా త‌ప్ప‌కుండా పాటిస్తూ పోయేవార‌ట‌.

అందుకే 'డైరెక్ట‌ర్ ఓ క‌మాండ‌ర్‌.. నేను సోల్జ‌ర్ ని' అని అక్కినేని నాగేశ్వ‌ర‌రావు చెబుతుండేవారు. ఆ రోజుల్లో ఏ న‌టుడు కూడా ద‌ర్శ‌కుడి వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చేవారు కాదు. ఏ ఎన్నార్ కూడా ద‌ర్శ‌కుడు తీసే షాట్ గురించి తెలుసుకుని త‌ను ఏం చేయ‌మంటే అది.. ఎక్క‌డ ఎలా నిల‌బ‌డ‌మంటే అలా నిల‌బ‌డి త‌ను చెప్పింది చెప్పిన‌ట్టుగా చేసేవార‌ట‌.అంతే కాకుండా ఏదైనా సందేహం వుంటే అడిగే వార‌ట కానీ నేను ఇలాగే చేస్తాను.. ఇంత వ‌ర‌కే డైలాగ్ చెబుతాను.. ఇలా చెబితే బాగుంటుంది అని ఎదురు చెప్పేవారు కాద‌ట‌.

ద‌ర్శ‌కుడు కొత్త‌వాడైనా కానీ అక్కినేని వారు ఏ విష‌యంలోనూ ఇన్ వాల్వ్ అయ్యేవారు కాద‌ట‌. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ముందు ఎలాంటి క్ర‌మ శిక్ష‌ణ‌, విధేయ‌త‌తో వుండేవార‌ట‌. ఎన్టీఆర్ కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించేవార‌ట‌. అయితే సొంత సినిమా అయితే మాత్రం ఎన్టీఆర్ అన్నీ తానే చూసుకునేవార‌ట‌. సెట్ లో ద‌ర్శ‌కుడు వున్నా స‌రే ఎన్టీఆర్ ఆర్టిస్ట్ ల‌కు సీన్ లు వివ‌రించే వార‌ట‌. ఇక క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు, యోగానంద్ వంటి ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్క‌తున్న‌ప్పుడు మాత్రం కో డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించేవార‌ట‌.

అయితే త‌రువాత వ‌చ్చిన న‌టుల్లో కొంత మంది ద‌ర్శ‌కుల‌కే షాట్స్ ఇలా తీయండి.. కెమెరా ఈ యాంగిల్ లో పెట్టండి అని చెప్పేవార‌ట‌. ఈ విష‌యంలో విల‌న్ రాజ‌నాల పేరు ప్ర‌ముఖంగా వినిపించేద‌ని చెబుతున్నారు.

త‌న‌తో క‌లిసి న‌టించే న‌టీన‌టుల‌కు డైలాగ్ లు ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టుగా కాకుండా త‌ను చెప్పిన‌ట్టుగా చెప్ప‌మ‌ని రాజ‌నాల స‌ల‌హాలు ఇచ్చేవార‌ట‌. ద‌ర్శ‌కుడు ఎస్‌. భావ‌నారాయ‌ణ 1962లో 'నువ్వా నేనా' అనే మూవీని తీశార‌ట‌.

ఇందులో కాంతారావు, దేవిక జంట‌గా న‌టించారు. రాజ‌నాల ఇందులో విల‌న్ గా న‌టించారు. అయితే ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ లో కెమెరామెన్ శేష‌గిరి రావుకు రాజ‌నాల సూచ‌న‌లిచ్చార‌ట‌. కెమెరా ఇక్క‌డ పెట్టు.. ఈ యాంగిల్ లో పెట్టు అని చెప్ప‌డంతో రాజ‌నాల‌ని ద‌ర్శ‌కుడు భావ‌నారాయ‌ణ మంద‌లించార‌ట‌. నువ్వు సీన్ లో లేవుగా కుదురుగా కూర్చో క‌న్ఫ్యూజ్ చేయ‌కు అని మంద‌లించార‌ట‌. ఒకానొక సంద‌ర్భంలో గుమ్మ‌డికి కూడా రాజ‌నాల డైలాగ్ లు ఇలా చెప్పాల‌ని నేర్పించే ప్ర‌య‌త్నం చేస్తే ఆయ‌న సీరియ‌స్ కావ‌డ‌మే కాకుండా సెట్ లో నుంచి బ‌య‌టికి వెళ్లిపోయార‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.