Begin typing your search above and press return to search.
నెట్రో స్టార్ కూడా పీరియాడిక్ ఫిల్మ్ అంటున్నాడు!
By: Tupaki Desk | 27 Oct 2022 6:53 AM GMTటాలీవుడ్ లో పీరియాడిక్ సినిమాల జోరు మరింతగా పెరుగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు న్రతీ ఒక్కరూ పీరియడిక్ డ్రామాలని ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా కథబలమున్న ఇలాంటి సినిమాలకు పట్టంకడుతున్న నేపథ్యంలో చాలా మంది హీరోలు ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో నిట్రో స్టార్ సుధీర్ బాబు కూడా పీరియాడిక్ ఫిల్మ్ తో రాబోతున్నాడు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజక వర్గం అయిన కుప్పం నేపథ్యంలో సాగే కథ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. 1989 నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నారు. సుధీర్ బాబు నటిస్తున్న 18వ మూవీగా రూపొందనున్న ఈ సినిమాని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి. నాయుడు నిర్మించనున్నారు. ఈ మూవీకి 'సెహరి' ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించనున్నాడు.
గురువారం ఈ ప్రాజెక్ట్ ని ప్రకటిస్తూ చిత్ర బృందం ఇన్ లాండ్ లెటర్ పై హీరో క్యారెక్టర్ నేమ్ తో పాటు..తన రాక కోసం సౌత్ బాంబేకు చెందిన అరుణ్ గౌలి అనే వ్యక్తి ఎదురుచూస్తున్నట్టుగా రాసిన ఉత్తరంగా చూపించిన తీరు ఆకట్టుకుంటోంది.
ఇందులో హీరో సుధీర్ బాబు శివారెడ్డి తనయుడు సుబ్రమణ్యంగా కనిపించబోతున్నాడు. కుప్పంలో వున్న అతనికి సౌత్ బాంబేలో వున్న అరుణ్ గౌలికి వున్న సంబంధం ఏంటీ? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఇన్ ల్యాండ్ లెటర్ ఎడమ భాగంలో ఓ టెంపుల్ ని చూపిస్తున్న తీరుని చూస్తుంటే ఈ మూవీలో ఆధ్యత్మిక ఆంశాలు కూడా ప్రధాన హైలైట్ గా నిలువనున్నాయని తెలుస్తోంది. లెటర్ అడుగు భాగంలో బ్లడ్ షేడ్ కనిపిస్తుండగా..సిగర్ వున్న యాష్ ట్రే.. పక్కనే ల్యాండ్ ఫోన్.. ఎడమ వైపు పురాతన ఫైవ్ హండ్రెడ్ నోట్.. కింది భాగంలో ఆ కాలం నాటి పిస్తోల్.. మూడు బులెట్లు కనిపిస్తున్న తీరు యాక్షన్ నేపథ్యంలో సాగే డ్రామాగా ఈ మూవీ ఉండనుందని స్పష్టం చేస్తోంది.
అక్టోబర్ 31న ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నారట. ఆ రోజునే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలని మేకర్స్ వెల్లడించే అవకాశం వుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.