Begin typing your search above and press return to search.

ఆ వేదిక‌పైనా జిగేల్ రాణి మ‌ళ్లీ జిల్ జిల్ అనిపించిందే!

By:  Tupaki Desk   |   19 March 2023 11:03 AM GMT
ఆ వేదిక‌పైనా జిగేల్ రాణి మ‌ళ్లీ జిల్ జిల్ అనిపించిందే!
X
ముంబై బ్యూటీ పూజాహెగ్డే వేగం కాస్త త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డిని వ‌రుస‌గా వైఫ‌ల్యాలు వెన‌క్కి నెట్టుతున్నాయి. దీంతో కొత్త క‌మిట్ మెంట్ల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంది. స‌రైన స్టోరీలైతే త‌ప్ప‌! సంత‌కం చేయ‌డం లేదు. బాలీవుడ్ లో జ‌రిగిన త‌ప్పిదాల్ని మ‌ళ్లీ రిపీట్ కాకుండా ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఉన్న ఇమేజ్ ని ఎన్ క్యాష్‌చేసుకునే అవ‌కాశం ఏది వ‌చ్చినా విడిచిపెట్ట‌డం లేదు. తెలివిగా బ్రాండింగ్స్ చేస్తూ స‌మ‌కూర్చుకుంటుంది.

వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే సినిమా ఈవెంట్ల‌కు అమ్మ‌డు హాజ‌ర‌వుతుంది. ఆ మధ్య కేన్స్ ఉత్స‌వాల్లో త‌ళుక్కున మెరిసింది. ఈ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తో అమ్మ‌డి రేంజ్ పెరిగింది. అప్ప‌టి నుంచి యాడ్స్ చేయ‌డంలో మ‌రింత ఆస‌క్తిగా ముందుకెళ్తుంది. గ‌త నెల‌లో ఓ అవార్డు వేడుక‌లో పాల్గొంది. ఆ షో ద్వారా భారీగానే ఖాతాలో వేసుకుంది. తాజాగా మ‌రో ఈవెంట్ లోనూ త‌ళుక్కున మెరిసింది.

మ‌రోసారి చిట్టిపొట్టి దుస్తుల్లో జిగేల్ అనిపించింది. ఇదిగో ఇక్క‌డిలా మ‌ల్టీ క‌ల‌ర్ స్క‌ర్ట్..బ్లౌజ్ ధ‌రించి హాట్ హాట్ అందాల‌తో స్టెప్పులేసి కుర్రాకారుకి కిర్రెక్కించింది. జిల్ జిల్ జిగేల్ రాణిలో రామ్ చ‌ర‌ణ్ సినిమాలో పాట‌కు ఎలాంటి హాట్ స్టెప్పులు వేసిందో ఆ ఈవెంట్లో ఓ హిందీ పాట‌కి అలాంటి డాన్సు చేసి జోష్ ని నింపింది. స్పాట్ లైట్..రంగుల లైట్లు న‌డుమ పూజా షైనింగ్ లో ఆక‌ట్టుకుంది.

పాట‌ని మ్యాచ్ చేసిన హ‌వ‌భావాలు అంతే ఆక‌ట్టుకున్నాయి. ఆ షోకి సంబంధించిన ఫోటోలు కొన్నింటిని అమ్మ‌డు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం అవి నెట్టింట వైర‌ల్ గా మారాయి. అభిమానులు జిగేల్ రాణిని త‌ల‌పిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బ్యూటీ సినిమాల సంగ‌తి చూస్తే ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి జోడీగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తోన్న సినిమాలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో 'కిసీకా భాయ్ కిసీకా జాన్' చిత్రంలో న‌టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.