Begin typing your search above and press return to search.

రౌడీ ఫ్యాన్స్‌ కూడా మొదలు పెట్టారు

By:  Tupaki Desk   |   30 Jan 2019 7:41 AM GMT
రౌడీ ఫ్యాన్స్‌ కూడా మొదలు పెట్టారు
X
టాలీవుడ్‌ హీరోలందరిలో విజయ్‌ దేవరకొండ చాలా ప్రత్యేకంగా అంటూ అభిమానులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అతి తక్కువ సమయంలోనే వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండకు యూత్‌ లో ప్రస్తుతం పిచ్చ క్రేజ్‌ ఉందనే విషయం అందరికి తెల్సిందే. అతి తక్కువ సమయంలోనే విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరో అయ్యాడంటూ మెగాస్టార్‌ చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించాడంటే ఏ స్థాయిలో మనోడి క్రేజ్‌ పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనను అభిమానించే ప్రతి ఒక్కరిని రౌడీస్‌ అంటూ పిలుచుకునే విజయ్‌ దేవరకొండ, తన అభిమానులు కూడా విభిన్నంగా ఉండాలని కోరుకుంటాడు.

విజయ్‌ అభిమానులు కూడా ఇప్పటి వరకు తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. కాని తాజాగా అందరు హీరోల అభిమానుల మాదిరిగానే తాము కూడా అంటూ రౌడీ అభిమానులు చెప్పకనే చెప్పేశారు. టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోల అభిమానులు సోషల్‌ మీడియాలో పిచ్చి హ్యాష్‌ ట్యాగ్స్‌ తో సందడి చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో బర్త్‌ డే వంద రోజుల్లో రాబోతుందని, ఆ సినిమా వచ్చి ఇన్నాళ్లయ్యిందంటూ హ్యాష్‌ ట్యాగ్స్‌ తో సోషల్‌ మీడియాలో చర్చించుకుంటూ ఉంటారు.

తాజాగా విజయ్‌ దేవరకొండ అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో 100 డేస్‌ టు విజయ్‌ దేవరకొండ బర్త్‌ డే అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌ చేశారు. ఆ హ్యాష్‌ ట్యాగ్‌ కాస్త వైరల్‌ అయ్యింది. పెద్ద ఎత్తున ఆ హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్వీట్స్‌ పడుతున్నాయి. ఇలాంటి చిల్లర వేశాలను రౌడీ ఫ్యాన్స్‌ వేస్తారని ఊహించలేదు, అందరు హీరోల ఫ్యాన్స్‌ మాదిరిగానే రౌడీ ఫ్యాన్స్‌ కూడా ఇలా సోషల్‌ మీడియాలో చిల్లర వేషాలు వేస్తున్నారు. ఇలాంటి వాటిని విజయ్‌ అయినా ఆపితే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్‌ కోరుతున్నారు.