Begin typing your search above and press return to search.
హిట్ టాక్ వచ్చినా 'కేజీఎఫ్ 2'కు అక్కడ నష్టాలు తప్పవా?
By: Tupaki Desk | 28 April 2022 6:34 AM GMTకన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం 'కేజీఎఫ్ 2'. హొంబాలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా చేశారు. 2018లో సైలెంట్ గా వచ్చి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' కు కొనసాగింపుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చాప్టర్ 1 ఎక్కడైతే ముగుస్తుందో అక్కడ నుంచే సెకండ్ పార్ట్ ప్రారంభం అవుతుంది. కథ పెద్దగా లేకపోయినా.. హీరో ఎలివేషన్ సీన్స్, యాక్షన్స్ ఎపిసోడ్స్ పీక్స్ లో ఉంటాయి. కేజీఎఫ్ కు కింగ్ గా తనదైన నటన, బాడీ లాంగ్వేజ్ తో యశ్ మరోసారి అదరగొట్టేశారు.
అలాగే ప్రతి సీన్ ను ప్రశాంత్ నీల్ చాలా గ్రిప్పింప్ గా రూపొందించాడు. మొత్తానికి తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
విడుదలై రెండు వారాలు గడుస్తున్నా చాలా చోట్ల కేజీఎఫ్ 2 జోరు తగ్గలేదు. అయితే ఏపీలో మాత్రం హిట్ టాక్ వచ్చినా ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. నైజాంలో ఈ సినిమాను రూ.25 కోట్లకు కొనుగోలు చేయగా.. రెండు వారాల్లో రూ.39.71 కోట్ల షేర్ ను వసూల్ చేసి అక్కడ బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ కేజీఎఫ్ 2ను రూ.49 కోట్లకి కొనుగోలు చేశారు.
కానీ, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 36.28 కోట్ల షేర్ నే రాబట్టగలిగింది. దీంతో ఇప్పుడీ సినిమా ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. మరో రూ.12.72 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సి ఉంటుంది.
ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత పెద్ద భారీ టార్గెట్ ను రీచ్ అవ్వడం అంటే కష్టమనే అంటున్నారు. పైగా రేపు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి చేసిన 'ఆచార్య' విడుదల కాబోతోంది. ఈ మెగా మల్టీస్టారర్ పై అంచనాలు వేరె లెవల్ లో ఉన్నాయి. మరి ఆచార్యతో పోటీ పడి కేజీఎఫ్ 2 ఏపీలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చేస్తుందో.. లేదో.. చూడాలి.