Begin typing your search above and press return to search.
ఈవెంట్ ఎవరిదైనా చిరు వెళ్లాల్సిందే
By: Tupaki Desk | 1 April 2022 2:30 PM GMTఇండస్ట్రీలో చిన్న సినిమా.. పెద్ద సినిమా అని లేడా లేకుండా ఏ ఈవెంట్ జరిగినా అక్కడ దర్శకరత్న దాసరి నారాయణరావు వుండి తీరాల్సిందే. ఛీప్ గెస్ట్ గా ఆయన మాట్లాడే స్పీచ్ ఇండస్ట్రీ వర్గాలు వినాల్సిందే. అప్పట్లో ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా దాసరి వున్నారు. ఇండస్ట్రీలో వున్న 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ కి ఎలాంటి సమస్య ఎదురైనా, పోనీ నిర్మాతలకు, హీరోలకు మధ్య సమస్య ఎదురైనా ఆ పంచాయితీ దాసరి వద్దకు వెళ్లాల్సిందే.. పరిష్కారం కావాల్సిందే. కార్మికులకు అన్యాయం జరిగిందని తెలిసినా ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా దాసరి పేరు ముందుగా వినిపించేది.
అయితే ఆయన మృతి తరువాత ఆ స్థానం ఎవరిదనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. అయితే చిరు తన పని తాను చేసుకుపోతూ కరోనా కష్ట కాలంలో సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) ని ప్రారంభించి కార్మికులకు నిత్యావసాలు అందించడమే కాకుండా వారికి నేనున్నానంటూ అభయమిచ్చి తానే ఇండస్ట్రీకి పెద్దన్నఅనే భావనని కలిగించారు. ఎప్నుడూ అదే భావనతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా దాసరి తరువాత ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి పెద్దదిక్కుగా మారారు అన్నది ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట.
ఈ మాటపై కొంత మంది విభేధించినా ఇండస్ట్రీకి పెద్ద ఎవరంటే మెగాస్టార్ అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. ఇంద జనం చెప్పేమాట కాదు యావత్ ఇండస్ట్రీ చెబుతున్నామాట అని ఇటీవల ట్రిపుల్ ఆర్ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏపీ టికెట్ రేట్ల విషయంలో ఆయన ఏపీ ప్రభుత్వం ముందు తగ్గారు అని చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. మామ్మల్ని నెగ్గించడానికే ఆయన తగ్గారు ఆయనవల్లే ఇదంతా జరిగింది అందుకే మెగాస్టార్ ఇండస్ట్రీకి పెద్దన్న అంటూ రాజమౌళి చిరు పెద్దరికంపై క్లారిటి ఇచ్చారు.
మెగాస్టార్ కూడా ఆ బాధ్యతల్ని సైలెంట్ గా మోస్తూ వస్తున్నారు. ఏ చిన్న సినిమా ఈవెంట్ అయినా.. పెద్ద సినిమా ఈవెంట్ అయినా పిలవగానే లేదు.. రాను అనకుండా వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కరోనా క్రైసిస్ నుంచి దాని ప్రభావం తగ్గిన తరువాత చిరు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తూ ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్ లు చేసినా వాటిని చిరునవ్వుతూ స్వీకరిస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
ఇటీవల చిన్న సినిమా 'మిషన్ ఇంపాజిబుల్' ఈవెంట్ లో సందడి చేసిన మెగాస్టార్ ఉగాది సందర్భంగా మాస్ మమారాజా రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ప్రారంభోత్సవానికి ముఖ్యతిథిగా హాజరవుతున్నారు.
గతంలో రవితేజ 'రావణాసుర' ఓపెనింగ్ కి వెళ్లి క్లాప్ కొట్టారు. ఇప్పడు మరోసారి 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ప్రారంభోత్సవానికి ముఖ్యతిథిగా హాజరవుతుండటం విశేషం. ఇదిలా వుంటే మెగాస్టార్ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.