Begin typing your search above and press return to search.

పంచ్: పార్టీ సాంగ్స్ పై పిడుగు వేశారుగా

By:  Tupaki Desk   |   3 Aug 2015 9:45 AM GMT


ఎవ్రీ బాలీవుడ్‌ పార్టీ సాంగ్‌.. ప్రస్తుతం యూట్యూబ్‌ లో హల్‌చల్‌ చేస్తున్న ఈ సాంగ్‌ యువతరంలో ఓ హాట్‌ టాపిక్‌. అప్పట్లో "రోస్ట్" వీడియో తో సంచలనం సృష్టించిన అల్ ఇండియా బ్యాక్ చోద్ అనే యుట్యూబ్ గ్రూప్ ఇప్పుడు మళ్ళి ఇలా ఎటాక్ ఇచ్చింది. పార్టీ సాంగ్‌ అంటూ ఇర్ఫాన్‌ అండ్‌ గ్యాంగ్‌ చేసిన ఆగడాలు ఆషామాషీ గా లేవు. పబ్బు, క్లబ్లు లో మందేసి చిందేసి, అటుపై మగువలతో రోమాంచితంగా ఎంజాయ్‌ చేయాలనుకునే నవతరం, యువతరం కలల్ని ఈ పార్టీ సాంగ్‌ లో చూపించారు. అంతేనా బాలీవుడ్‌ లో పార్టీ సాంగ్స్‌ ఎంత మజాగా ఉంటాయో ఈ ఒక్క పాటలోనే ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా ఈ వీడియో లో చెప్పుకోదగినది సాంగ్‌ మేకింగ్‌ స్టయిల్‌. ఓ చోట ఓ గుంపు కూచుని ఉంటారు. అక్కడ పార్టీ సాంగ్‌ అన్న టాపిక్‌ మొదలవుతుంది. అసలు పార్టీ సాంగ్‌ అంటే ఎలా ఉండాలి? అనేది విజువలైజేషన్‌ ఇమాజినేషన్‌ లో మొదలవుతుంది. ఈ మొత్తం వీడియో ని కెమెరాలో బంధించిన తీరు అద్భుతంగా ఉంది. ఓ సింపుల్‌ కాన్సెప్టు, అర్థవంతమైన టాపిక్‌ తో ఓ పాటని ఎలా విజువలైజ్‌ చేయాలి? అన్నది ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. బాలీవుడ్ పార్టీ సాంగ్స్ వుండే రెగ్యులర్ షాట్స్, లిరిక్ లైన్స్ అన్ని చెబుతూ రచ్చ చేసారనుకోండి. వాసన్‌ డైరెక్షన్‌, షాజబ్‌ షేక్‌ కిరియోగ్రఫీ, రంగరాజన్‌ కెమెరా అద్భుతంగా పనిచేశాయి. ఈసారి బాలీవుడ్ వీళ్ళ సటైర్ను ఎలా తీసుకుంటుందో.