Begin typing your search above and press return to search.
లవ్వర్స్ డేను సింపుల్ గా తేల్చేసింది
By: Tupaki Desk | 12 Feb 2019 6:30 AM GMTహీరోయిన్ అన్నంతనే ముద్దుముద్దుగా మాటలు చెప్పే ధోరణి ఒకప్పుడు ఉండేది. మిగిలిన వుడ్డులతో పోలిస్తే.. టాలీవుడ్ నటీమణుల్లో జాగ్రత్త పాళ్లు టన్నులు టన్నుల లెక్కన ఉండేది కాదు. మీడియాతో మాట్లాడేటప్పుడు చెప్పిన మాటల్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం.. నేను చెప్పిన మాటల్లో ఏమైనా కాంట్రావర్సీలు ఉన్నాయా? అంటూ ప్రత్యేక ఇంటర్వ్యూల సందర్భంగా చెప్పటం ఉండేది.
మీడియా రోజులు పోయి సోషల్ మీడియా రాజ్యమేలుతున్న వేళ.. కొందరు హీరోయిన్లలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. మనసులోని మాటను చెప్పటానికి వారు జంకటం లేదు. అస్సలు మొహమాట పడటం లేదు. తమ మాటల్ని మీడియా బాగానే అర్థం చేసుకున్నా.. సోషల్ మీడియాలోని ఒక వర్గం ఆగమాగం చేస్తుందన్న సందేహాన్ని పక్కన పెట్టేసి కొందరు డేర్ చేస్తున్నారు.
అలాంటి కోవకే చెందింది రకుల్ బేబీ. తాజాగా ఆమె ఆసక్తికరవిషయాన్ని వెల్లడించారు. ప్రేమికుల దినోత్సవం అంటూ హడావుడి చేసే దానికి ఆమె చెప్పిన మాటలు వింటే రకుల్ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. హడావుడి చేసే ప్రేమికుల దినోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న క్వశ్చన్ ను సూటిగా అడిగేసింది. తనకు ప్రేమికుల దినోత్సవం మీద ఎలాంటి నమ్మకాలు లేవని తేల్చేసింది. ఇదంతా ప్రాశ్చాత్య సంస్కృతిగా కొట్టి పారేసిన ఆమె.. మనం వేడుక చేసుకోవటంలో అర్థం లేదంది.
అయినా.. ప్రేమకు ఒక్క రోజేంటి? ఆ రోజంతా సంతోషంగా ఉండి.. గిఫ్టులు ఇచ్చుకుంటే సరిపోతుందా? మిగిలిన ఏడాదంతా ప్రేమించాల్సిన అవసరం లేదా? కమర్షియల్ గా ఇవన్నీ బాగుంటాయి. వాలెంటైన్స్ డే పేరుతో డబ్బులు ఎక్కువ ఖర్చు చేయటం.. షాపింగులు.. గిఫ్టులు అంటూ డబ్బును దుబారా చేయటమే కానీ మరొకటి ఉండదని తేల్చేసింది. లక్షలాది మంది అపురూపంగా భావించే ప్రేమికుల దినోత్సవాన్నిఇంత సింఫుల్ గా కొట్టేసే రకుల్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే సుమి!