Begin typing your search above and press return to search.
ఎవరినీ మరువరు అందుకే ఆయన బాస్
By: Tupaki Desk | 4 Oct 2019 9:25 AM GMTభారీ పాన్ ఇండియా చిత్రం సైరాకు పని చేసిన నటీనటులతో పాటుగా.. టెక్నికల్ టీమ్ కి మంచి పేరొచ్చింది. కెమెరా.. కళ.. గ్రాఫిక్స్.. ప్రొడక్షన్ డిజైన్ వీటన్నిటితో పాటు సైరాకు ఉపయోగించిన భారీ కాస్ట్యూమ్స్ కి మంచి పేరొచ్చింది. నిర్మాతగా రామ్ చరణ్ రాజీ లేని పెట్టుబడులు.. సాహసానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కుమార్తె సుశ్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన హార్డ్ వర్క్ కి పేరొచ్చింది. అందుకే సక్సెస్ వేదికలపై చిరు అంతగా ఎగ్జయిట్ అవుతున్నారు. తన వారసులైన నిర్మాత రామ్ చరణ్ .. కాస్ట్యూమ్ డిజైనర్ సుశ్మిత ఇద్దరినీ మర్చిపోకుండా చిరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే కేవలం వారసులకు మాత్రమేనా ప్రశంసలు? అంటే ఎవరినీ మర్చిపోకుండా పేరు పేరునా చిరు కృతజ్ఞతలు చెప్పడం అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక సైరా చిత్రానికి సుశ్మితతో పాటుగా కొందరు కాస్ట్యూమ్స్ విభాగంలో పని చేశారు. చిరు మినహా ఇతర పాత్రధారులందరికీ ఉదరా మీనన్ స్టైలింగ్ చేశారు. అలాగే అంజుమోదీ కూడా సైరా పాత్రధారులకు డిజైన్లు అందించారు. ఆ ఇద్దరి పేర్లను ప్రస్థావిస్తూ ప్రశంసలు కురిపించారు.
అందుకే ఇలాంటి గొప్ప క్వాలిటీస్ ఉన్న స్టార్ కాబట్టే పరిశ్రమలో దర్శక నిర్మాతలే కాకుండా ప్రతి ఒక్కరూ చిరును అభిమానిస్తారు. ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేసినా అందరికీ గుర్తింపు దక్కడం కష్టం. కొందరికి సరైన క్రెడిట్ కూడా ఇవ్వరు. అలాంటిది చిరు స్థాయీ భేధం లేకుండా అందరికీ గొప్ప గుర్తింపును ఇస్తుంటారు. సుశ్మిత గొప్ప స్టార్ కి కుమార్తె అయినా నేలపై కూచుని పని చేశారని చిరు థాంక్స్ మీట్ లో అన్నారు. చివరికి కాస్ట్యూమ్స్ తో పాటు పాత్రధారుల చెప్పుల విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుందని తెలిపారు.