Begin typing your search above and press return to search.

అందరికీ బాలయ్యే కావాలి..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:57 AM GMT
అందరికీ బాలయ్యే కావాలి..!
X
బాక్సాఫీస్ బొనాంజా నటసింహం నందమూరి బాలకృష్ణ "అన్ స్టాపబుల్ విత్ NBK" అనే టాక్ షో తో ఎంట్రీ ఇస్తూనే డిజిటల్ స్పేస్ లో సంచలనం సృష్టించారు. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన ఈ కార్యక్రమం.. దెబ్బకు బాలయ్య మీద అందరి థింకింగ్ ని మార్చేసిందని చెప్పాలి.

వెండితెర మీద తనదైన శైలి భారీ డైలాగ్స్ తో యాక్షన్ తో అలరించిన బాలయ్య.. రియల్ లైఫ్ లో అభిమానులను కార్యకర్తలను కొట్టడం వాటికి ప్రసిద్ది చెందాడు. పబ్లిక్ ఫంక్షన్స్ లో కోపగించుకోవడాలు.. చిరాకు పడటం వంటివి జనాల్లో ఆయన్ని ఆవేశపరుడిగా కోపదారి మనిషిగా షార్ట్ టెంపర్ గా అహంకారిగా అనుకునేలా చేశాయి.

అయితే 'అన్ స్టాపబుల్' టాక్ షో బాలకృష్ణలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. నట సింహాన్ని సరికొత్తగా పరిచయం చేసింది. సినిమాల్లో నటించినా.. నిజ జీవితంలో నటించరని తెలియజేసింది. ఆయన ముక్కుసూటితనం వల్లనే అలా అనుకుంటారని చెప్పకనే చెప్పింది.

కోపం, బాధ, ప్రేమ, ఆనందం.. ఇలా ఏదైనా ఉన్నది ఉన్నట్లు వెంటనే చూపిస్తారని.. ఎమోషన్స్ ను అస్సలు దాచుకోలేరని బాలకృష్ణ సన్నిహితులు చెబుతుంటారు. అన్ స్టాపబుల్ చూసిన తర్వాత అందరికీ అది నిజమే అనే ఫీలింగ్ ని కలిగించింది. ఇదే బాలయ్యని జనాలకి బాగా దగ్గర చేసింది.

అన్ స్టాపబుల్ కు గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలిలో ఆట పట్టించడం.. ఊహించని ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టడం.. సినిమాలకి సంబంధించిన ఎన్నో విశేషాలను తెలియజేయడం వంటివి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అంశాలే సీనియర్ హీరోని అందరికీ చేరువయ్యేలా చేసింది.

'అన్‌ స్టాపబుల్‌' టాక్ షోతో బాలకృష్ణ చుట్టూ పాజిటివిటీ నెలకొన్న నేపథ్యంలో.. ఇప్పుడు యువ హీరోలకు మెయిన్ టార్గెట్ గా మారిపోయారు. బాలయ్య వస్తే తమ చిత్రానికి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. అగ్ర హీరో సైతం కుర్ర హీరోలకు తనవంతు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

బాలయ్య గతంలో పలువురు చిన్న మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసి మార్కెటింగ్ కి తనవంతు సహాయం చేసేవారు. గుంటూరు టాకీస్ నుంచి సెహరి వరకూ ఎన్నో చిత్రాల పబ్లిసిటీలో ఆయన భాగమయ్యారు. అయితే ఇప్పుడు ఏకంగా సినిమాల పబ్లిక్ ఈవెంట్స్ కి గెస్టుగా హాజరవుతున్నారు.

ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' ప్రీరిలీజ్ ఈవెంట్‌ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సినిమాకు మంచి టాక్ రావడమే కాదు.. వసూళ్లలో ఓకే ఫరవాలేదు అనిపించుకుంది.

ఇప్పుడు లేటెస్టుగా యువ హీరో విశ్వక్ సేన్ నటించిన "మాస్ కా ధమ్కీ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వచ్చారు. తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అందరికీ ఆకట్టుకున్నారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ గాడ్ అతిథిగా రావడంతో ఇది ఎక్కువ మందికి రీచ్ అయిందని చెప్పాలి.

అన్ స్టాపబుల్ టాక్ షో తర్వాత ప్రజలు బాలయ్యని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అది ఎంతగా అంటే అన్ స్టాపబుల్ ముందు అన్ స్టాపబుల్ తర్వాత అని మాట్లాడుకునేంతగా. అఖండ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంలో పరోక్షంగా ఈ షో పాత్ర ఉందనేది ఎవరూ కాదనలేరు.

అందుకే ఇప్పుడు యువ హీరోలందరూ బాలయ్యకు జనాల్లో ఉన్న ఇమేజ్ తమ సినిమాలకి ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. తమ మూవీ ఫంక్షన్స్ కు గెస్టుగా రావాలని కోరుకుంటున్నారు. బాలకృష్ణ సైతం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నిజాయితీతో కూడిన తన స్పీచ్ తో సినిమాకి బజ్ తీసుకొస్తున్నారు.

ఇకపై బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యే సినిమాలన్నీ వరుసగా హిట్లు అయితే మాత్రం.. ఇండస్ట్రీలో 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర పడిపోతుంది. సెంటిమెంట్ గా అందరూ ఆయన వైపే చూసే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో బాలకృష్ణ పబ్లిక్ ఈవెంట్ల సందడి ఎలా ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.