Begin typing your search above and press return to search.
అంతా జైలు సెట్లోనే.. దానికే ఖర్చంతా!-నితిన్
By: Tupaki Desk | 21 Feb 2021 12:30 AM GMTటాలీవుడ్ ఫేజ్ మారుతోంది. ఇటీవల డిఫరెంట్ జోనర్ సినిమాల వెల్లువ పెరిగింది. ఇదంతా నవతరం ప్రయత్నం వల్లనే సాధ్యమవుతోంది. అయితే ఎంకరేజ్ చేసే హీరోలు కూడా మనకు పెరిగారు. చంద్రశేఖర్ ఏలేటి లాంటి సీనియర్ తొలి నాళ్ల నుంచి ఇదే పంథాలో ఉన్నారు. వైవిధ్యమైన సినిమాలే తీశారు. ఇప్పుడు నితిన్ తో తీస్తున్న చెక్ అలాంటిదే. ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెక్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీ ఆదిత్య పాత్రలో నేను నటించాను. చెక్ నిజ సంఘటనల ఆధారంగా రాసుకున్న స్క్రిప్ట్ అని చంద్రశేఖర్ యెలేటి తొలి నుంచి చెబుతున్నారు. అది తెరపైనా కనిపిస్తుంది. చెక్ అనేది జైలు శిక్ష సమయంలో చెస్ ఆడిన ఒక అమెరికన్ ఖైదీ కథ అని ఏలేటి అన్నారు. ఆర్నెళ్లలోనే స్క్రిప్టు ఫైనల్ చేశాం.
ప్రయోగం చేయాలంటే తొలి ఛాయిస్ ఏలేటినే. అందుకే ఈ సినిమా చేశాను. ఆయన టెక్నికల్ గా చాలా అనుభవజ్ఞుడు. సినిమాని జైలు గోడల నడుమ సెట్లలో అద్భుతంగా తెరకెక్కించారు.. అని నితిన్ తెలిపారు.
ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో నటించగా.. రెండవ కథానాయికగా ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ కి ఇది విలక్షణ సినిమా. మంచి పేరు తో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందని టీమ్ ఆశిస్తోంది.